అన్వేషించండి

Magnesium Deficiency : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

Benefits of Magnesium: మెగ్నీషియం పూర్తి ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో లోపిస్తే.. సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెగ్నీషియం శరీర జీవక్రియలకు, కండరాల పనితీరుకు చాలా అవసరం.
  • లోపం వల్ల కండరాల నొప్పులు, మైగ్రేన్, రక్తపోటు సమస్యలు వస్తాయి.
  • మెగ్నీషియం నిద్ర, రక్తచక్కెర, ఎముకలు, గుండెకు సహాయపడుతుంది.
  • సప్లిమెంట్లు వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

Magnesium Health Benefits : మన శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి. ఇది శరీరంలో 300 కంటే ఎక్కువ జీవరసాయన చర్యల్లో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కండరాలు, నరాల పనితీరు, రక్తపోటు నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలు, ప్రోటీన్ ఉత్పత్తి వంటి అనేక ప్రక్రియలు సక్రమంగా జరిగేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.

మెగ్నీషియం లోపం ఉంటే కలిగే ఇబ్బందులు 

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే కండరాల నొప్పులు, తిమ్మిర్లు, అలసట, బలహీనత, చేతులు కాళ్లు మొద్దుబారడం వంటి సమస్యలు కనిపించవచ్చు. తీవ్రమైన లోపం ఉంటే గుండె స్పందనలో మార్పులు, అధిక రక్తపోటు, ఎముకల బలహీనత, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని.. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెగ్నీషియం లోపిస్తే.. మైగ్రేన్ పెరుగుతుందా? 

మెగ్నీషియం లోపం మైగ్రేన్‌కు ఒక కారణంగా భావిస్తారు. మైగ్రేన్‌తో బాధపడేవారిలో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉండే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మైగ్రేన్ తీవ్రత, తరచుదనం తగ్గే అవకాశం ఉంటుంది.

రక్తపోటు నియంత్రణ.. 

మెగ్నీషియం రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో అధిక రక్తపోటు ఉన్నవారిలో బీపీని కొంత మేర కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

మెరుగైన నిద్ర కోసం 

నిద్రలేమి లేదా నిద్ర నాణ్యత తక్కువగా ఉండే వారికి మెగ్నీషియం ఉపయోగకరంగా ఉండొచ్చు. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అలాగే మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడటం ద్వారా నిద్రను మెరుగుపరచవచ్చు.

ఆందోళన, ఒత్తిడిని తగ్గించవచ్చు

మెగ్నీషియం కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో స్వల్ప స్థాయి ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ

మెగ్నీషియం ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడవచ్చు. మెగ్నీషియం లోపం ఉంటే గ్లూకోజ్ జీవక్రియపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

ఎముకలను బలం కోసం..

ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా అవసరం. ఇది కాల్షియం శోషణను మెరుగుపరచి ఎముకల సాంద్రతను కాపాడటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడవచ్చు.

కండరాల పనితీరుకై..

కండరాల సంకోచం, సడలింపులో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల కండరాల తిమ్మిర్లు, కాళ్లలో రాత్రివేళ వచ్చే క్రాంప్స్, అలసట వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడవచ్చు. వ్యాయామం చేసే వారు, వృద్ధులు దీనివల్ల ప్రయోజనం పొందవచ్చు.

గుండె జబ్బుల 

మెగ్నీషియం గుండె స్పందనను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే మెగ్నీషియం సప్లిమెంట్లను స్వయంగా తీసుకోవడం కంటే.. వైద్యుల సలహాతో డైట్లో తీసుకోవడమే మంచిది. అధిక మోతాదులో తీసుకుంటే విరేచనాలు, వికారం, కడుపు అసౌకర్యం వంటి దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. అందుకే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం అవసరం.

ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget