అన్వేషించండి

Type 2 Diabetes Risk : టైప్ 2 డయాబెటిస్​ను​ పెంచేస్తున్న రెగ్యూలర్ ఫుడ్స్.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Emulsifier Effect : నిర్థిష్టమైన ఎమల్సిఫైయర్లను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ఇంతకీ ఎమల్సిఫైయర్లు అంటే ఏమిటి? ఇవి దేనిలో ఉంటాయో చూద్దాం. 

Emulsifier is Dangerous for Type 2 Diabetes : కొన్నిరకాల ఫుడ్స్​ని చిక్కగా, సంరక్షించడానికి, ఆకృతిని మెరుగుపరిచేందుకు ఉపయోగించే ఆహార పదర్థాన్నే ఎమల్సిఫైయర్లు అంటారు. ఇవి డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని తాజాగా నిర్వహించిన అధ్యయనం తెలిపింది. అయితే ఇది చాలా ఫేమస్​ అయిన ఆహారాలలో ఉంటాయని షాకింగ్ విషయాలు తెలిపింది. అంతేకాకుండా.. FDA వీటిని సురక్షితమైనవిగానే గుర్తించింది. కానీ తాజాగా జరిపిన అధ్యయనం ఈ ఎమల్సిఫైయర్లు టైప్ 2 డయాబెటిస్​ను ప్రమోట్ చేస్తున్నాయని షాకింగ్ విషయం తెలిపింది. 

డీకోడ్ చేసిన అధ్యయనం

రక్తంలో చక్కెర స్థాయిలు నిశ్శబ్ధంగా ఎలా పెరుగుతున్నాయో ఈ అధ్యయనం తెలిపింది. బిస్కెట్లు, సలాడ్స్​ వంటి వాటి ద్వారా ఎమల్సిఫైయర్లు శరీరంలోకి వెళ్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇన్సులిన్ నిరోధకతపై ఎమల్సిఫైయర్లు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయని ఈ అధ్యయనంలో డీకోడ్ చేశారు. దీనిగురించి.. ది లాన్సెట్​లో ప్రచురించారు. ఈ న్యూ స్టడీ.. ఎమల్సిఫైయర్లు వల్ల టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చేస్తుందని గుర్తించింది. రెగ్యూలర్​గా వినియోగించే, ప్రాసెస్ చేసిన ఏడు ఆహారాలలో ఎమల్సిఫైయర్​లు ఉన్నట్లు గుర్తించారు. 

ఇన్సులిన్​పై ప్రతికూల ప్రభావం

మయోనైస్, సలాడ్ డ్రెస్సింగ్, కుకీలు, బ్రెడ్స్, ఐస్​క్రీమ్​లు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఫుడ్స్ లేబుల్​పై ఓ కన్ను వేయాలని చెప్తున్నారు. ఎమల్సిఫైయర్లు.. చమురు, నీరు వంటి రెండు వేర్వేరు పదార్థాలను కలిపి చేసే బైండింగ్ ఏజెంట్​లుగా చెప్తున్నారు. ఇవి టైప్ 2 డయాబెటిస్​ను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ఉప్పు, మోనో డైగ్లిజరైడ్స్, ఫ్యాట్స్, సోడియం సిట్రేట్, క్యారేజీనన్స్ లేదా సముద్రపు పాచి, గ్వార్ గమ్, శాంతన్ గమ్​.. ఈ పదార్థాలు ఇన్సులిన్​ నిరోధకతకు దారితీస్తాయి. గట్ బ్యాక్టీరియా, జీవక్రియ పనితీరులో జోక్యం చేసుకుని.. మధుమేహ ప్రమాద కారకాలను 15 శాతం వరకు పెంచుతాయని అధ్యయనం తెలిపింది. 

ఆ కెమికల్స్​తో జాగ్రత్త

ఐస్​ క్రీమ్​, బట్టర్, మయోన్నైస్ వరకు రోజువారీ ఆహారాల్లో ఎమల్సిఫైయర్​లు చూడవచ్చు. ఇవి అంతర్లీనంగా చెడు చేయవు. కానీ.. ఎమల్సిఫైయర్లు పండ్లలోని పెక్టిన్​ వలె సహజంగా కూడా సంభవిస్తాయి. అయితే కొన్ని పరిశోధనలు ఆహార సంకలిత ఎమల్సిఫైయర్​లు కొన్ని వ్యాధులపై తీవ్ర ప్రభావాలు ఇస్తాయి. క్యారేజీనాన్స్, క్యారేజీనన్ గమ్, ట్రిపోటాషియం ఫాస్పేట్, మోనోగ్లిజరైడ్స్, డైగ్లిజరైడ్స్, గమ్ అరబిక్, క్షాంతన్ గమ్.. ఈ ఏడురకాల ఎమల్సిఫైయర్స్​ టైప్ 2 డయాబెటిస్​కు ప్రధాన కారణమవుతున్నాయి. 

ఎమల్సిఫైయర్స్ అంటే ఏమిటి?

ఎమల్సిఫైయర్లు కెమికల్స్. ఇవి సాధారణంగా ఆహార పదార్థాల్లో ఉంటాయి కానీ.. వాటిలో కలిసిపోవు. నీళ్లలో నూనె కలుస్తుందా? లేదు కదా.. అలానే ఎమల్సిఫైయర్లు కూడా ఫుడ్​లో కలిసిపోవు. కానీ ఇవి మిశ్రమంగా మార్చడానికి సహాయపడతాయి. కొన్ని ఆహార పదార్థాలను ఎక్స్​పెయిరీ డేట్​ వరకు చిక్కగా, కరిగిపోకుండా ఉండేందుకు దీనిని ఉపయోగిస్తారు. నీరు, కొవ్వు పదార్థాలను ఒకదానితో ఒకటి బాగా మిక్స్​ చేస్తారు. ఐస్​క్రీమ్​ను కూడా ఇలానే తయారు చేస్తారు. అందుకే అది కరిగిపోకుండా ఉంటుంది. 

వాటికి దూరంగా ఉంటే మంచిది..

ఎమల్సిఫైయర్లు టైప్​ 2 డయాబెటిస్​కు దారి తీస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో ఎమల్సిఫైయర్​లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అధ్యయనం కోసం మే 1, 2009 నుంచి ఏప్రిల్ 26, 2023 వరకు లక్షమందిని పైగా స్టడీ చేశారు. పరిశోధకులు ప్రతి ఆరు నెలలకు ఈ స్టడీలో పాల్గొనేవారి ఆహారపు అలవాట్లు, ఎమల్సిఫైయర్ ఎక్స్​పోజర్​ను ల్యాబ్ పరీక్షల ద్వారా ట్రాక్​ చేశారు. ఈ ఫాలో అప్ తర్వాత.. టైప్​ 2 డయాబెస్​తో బాధపడుతున్నవారిని, వారి డేటాను గమనించి.. నిర్దిష్టమైన ఎమల్సిఫైయర్లు తీసుకోవడం వల్లనే టైప్ 2 మధుమేహం వచ్చినట్లు గుర్తించారు. 

ఈ ఎమల్సిఫైయర్​లు గట్​లోని రక్షిత శ్లేష్మ పొరను దెబ్బతీస్తాయి. గట్ ప్రమాదాన్ని పెంచుతాయని మునుపటి పరిశోధనలు కూడా తెలిపాయి. దీనివల్ల కడుపులో మంట సమస్య ఎక్కువ అవుతుంది. పోషకాలను, జీవక్రియలను ఉత్పత్తి చేసే గట్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది శరీరంపై ప్రభావం చూపి.. ఇన్సులిన్​ సున్నితత్వాన్ని, గ్లూకోజ్​ను జీవక్రియ చేసే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపి మధుమేహానికి దారి తీస్తుంది. 

Also Read : లేట్​ నైట్​ పడుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. అర్థరాత్రి దాటాక నిద్రపోతే అర్థాయుష్షు తప్పదట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget