అన్వేషించండి

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్ కోసం కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైతుల నుంచి భూములు సేకరించేందుకు జనవరి 3న నోటిఫికేషన్ జారీ చేయనుంది.

Amaravati Latest News: అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా రెండోదశ పూలింగు నోటిఫికేషన్ జనవరి 3న విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్య NDA పాలనలో రాజధాని ప్రక్రియ జనవరిలోనే మొదలైందని, అందుకే సెంటిమెంట్‌గా ఈ దఫా కూడా జనవరిలోనే ల్యాండ్ పూలింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో ఏడు గ్రామాల నుంచి భూసమీకరణ ప్రక్రియ మెదలు కానుంది.

ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్యాబినెట్

2025 నవంబరు 27న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఏడు గ్రామాల్లో భూ సమీకరణ అధికారాన్ని సిఆర్డీఏ కమిషనర్‌కు అప్పగించారు. తాజా నోటిషికేషన్ ద్వారా 16,562.56 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైండ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు. దీంతోపాటు ప్రభుత్వ భూమి 3828.56 ఎకరాలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీకి అవసరమైన అధికారులను ఎంపిక చేసింది. కార్యాలయాలూ తీసుకుంది. 

మొదట్లో డిసెంబర్‌లోనే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినా వేర్వేరు కారణాలతో ఆలస్యమైంది. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లెలో భూసమీకరణకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించి నివేదికలు తయారుచేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు. 

వడ్డమానులో రైతులతో సమావేశం సందర్భంగా వచ్చే నాలుగేళ్లలో అభివృద్ధి చేసి ఇవ్వాలని లేనిపక్షంలో రైతుకు ఐదు లక్షలు పరిహారం ఇచ్చేలా ఒప్పంద పత్రంలో చేర్చాలని రైతులు కోరారు. దీనిపై గతంలోనే గ్రామసభలూ నిర్వహించారు. రైతుల నుంచి కూడా సమ్మతి లభించడంతో 2026 జనవరి మూడో తేదీన నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 28వతేదీలోపు ప్రక్రియను ముగించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు, అయితే రైతులు తమకు డెవలప్ చేసి ఇచ్చే భూములను బురద గుంటల్లో కాకుండా రహదారి పక్కన ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి వారి డిమాండ్ లను CRDA అధికారులు ఎలా తీరుస్తారో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget