అన్వేషించండి

Late Night Sleeping Habit : లేట్​ నైట్​ పడుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. అర్థరాత్రి దాటాక నిద్రపోతే అర్థాయుష్షు తప్పదట

Is It Harmful to Sleep After 11pm : సోషల్ మీడియా వచ్చాక.. చాలామంది నిద్రకు దూరమవుతున్నారనేది వాస్తవం. ఫోన్​ చూస్తూ అర్థరాత్రి దాటినా కూడా స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా అలాంటివారైతే జాగ్రత్త..

Sleeping late at night is very dangerous to your health : బిజీ లైఫ్, సోషల్ మీడియా నిద్రను దూరంచేస్తుంది. ముఖ్యంగా సోషల్​మీడియా​ అనేది ఎంతగా ప్రభావం చేస్తుందంటే.. కనీసం నిద్రపోవడాన్ని కూడా వదిలేసి దానిలోనే మునిగిపోతున్నాడు. సినిమాలు, సిరీస్​లు, ఐపీఎల్.. ముఖ్యంగా రీల్స్, మీమ్స్​కి బాగా అలవాటైపోయి.. శరీరానికి అత్యంత అవసరమైన నిద్రని కోల్పోతున్నారు. అర్థరాత్రి దాటేవరకు ఆన్​లైన్​లో ఉంటూ.. ఎప్పటికో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అయితే ఇలా నిద్రను ఆపేసుకుని.. అర్థరాత్రి దాటిన తర్వాత పడుకునేవారికి తాజాగా అధ్యయనం షాకింగ్ విషయం తెలిపింది. లేట్​గా నిద్రపోయేవారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని, దానివల్ల ఆయుష్షు తగ్గిపోతుందని తేల్చింది. 

ఈ తరహా నిద్ర మంచిది కాదు

రాత్రి అనేది నిద్రకు సంబంధించినది. ఆ సమయంలో ప్రశాంతత దొరుకుతుంది. చుట్టూ నిశ్శబ్ధంగా ఉండి.. నిద్రను ఆహ్వానిస్తుంది. ఆ రోజుల్లో రాత్రి తొమ్మిది అయ్యిందంటే.. వెంటనే నిద్రపోవాలని.. తెల్లవారు జాము 5 అయితే నిద్రలేవాలని అనుకునేవారు. దీనినే రివేంజ్ బైడ్​టైమ్ ప్రోక్రాస్టినేషన్ అంటారు. కానీ ఇప్పుడు 12 దాటినా నిద్రపోరు.. ఆఫీస్​ లేనివారు అయితే ఉదయం 9 అయినా నిద్రలేవరు. ఈ తరహా నిద్ర అస్సలు మంచిది కాదు అంటున్నారు. మరి కొందరు లేట్​నైట్​ పడుకుని.. అవసరాన్ని బట్టి ఉదయాన్నే తొందరగా లేస్తారు. దీనివల్ల నిద్ర సమయం తగ్గిపోతుంది. ఇది మరింత ప్రాణాంతకమవుతుంది. 

శరీరంపై తీవ్ర ప్రభావాలు ఉంటాయి

నిద్రవేళలు డిస్టర్బ్ అయితే సిర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది శారీరక, మానసిక సమస్యలను పెంచి.. దీర్ఘకాలిక ప్రమాదాలను పెంచుతుంది. సాధారణంగా నిద్ర అనేది.. శారీరక, మానసిక సమస్యలను రిపేర్ చేస్తుంది. కానీ నిద్ర సరిగ్గా లేకుంటే ఈ సమస్యలు రిపేర్ అవ్వడం అటుంచి.. సమస్యలు పెరిగేలా చేస్తుంది. కచ్చితంగా రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇది మానసిక శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది. రాత్రి నిద్ర అంటే ఉదయం వరకు పడుకోవాలని కాకుండా.. రాత్రి త్వరగా పడుకుని.. తెల్లవారుజామునే నిద్రలేచేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీ శక్తి స్థాయిలు పెరుగుతాయని పరిశోధనలు తెలిపాయి. 

ఆ నిద్ర లేకపోతే ఈ సమస్యలు తప్పవు

రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు లేకపోతే.. బరువు పెరుగుతారని నిపుణులు తెలిపారు. తర్వాత మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయని వెల్లడించారు. ముఖ్యంగా పగలు చేయాల్సిన పనిపై దృష్టి పెట్టడం కష్టతరమవుతుందని తెలిపారు. అంతేకాకుండా దృష్టిలోపం, జ్ఞాపకశక్తి తగ్గడం, చురుకుగా లేకపోవడం వంటి జరుగుతాయి. జీవక్రియ నెమ్మదించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా ప్రారంభమై.. మెల్లిగా ఇవి దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. స్థూలకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కొన్నిరకాల క్యాన్సర్​లు వస్తాయి. ఇవన్నీ మీ ఆయుష్షును తగ్గిస్తాయని.. అందుకే తగినంత నిద్ర అవసరమని చెప్తున్నారు. 

రాత్రి నిద్రతో కలిగే ప్రయోజనాలు

నిద్రలేకపోవడం వల్ల చేసే పనిపై దృష్టి పెట్టలేరు. దీనివల్ల ప్రతికూల చర్యలు జరుగుతాయి. ప్రమాదాలు, గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. చదువుపై దృష్టి పెట్టలేరు. అంతేకాకుండా వ్యక్తిగత సంబంధాలు కూడా నాశనమవుతాయి. నిద్రలో శరీరంలో రిలాక్స్ అవుతుంది కానీ.. మెదడు బాగా కష్టపడి పనిచేస్తుంది. మన ఆరోగ్య సమస్యలను రిపేర్ చేస్తుంది. జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేయడం.. దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని పెంచడం వంటి వాటిని ఇంప్రూవ్ చేసి.. మానసికంగా బెనిఫిట్స్ ఇస్తుంది. అందుకే మెరుగైన నిద్ర అలవాట్లను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను దూరం చేసే కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉంటూ.. రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తూ.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల నిద్రనాణ్యత పెరుగుతుందని చెప్తున్నారు. 

Also Read : మలేరియా పెరుగుతోంది పిల్లలు జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్ అంటున్న నిపుణులు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Embed widget