Protect Yourself From Malaria : మలేరియా పెరుగుతోంది పిల్లలు జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్ అంటున్న నిపుణులు
Prevention Tips for Malaria : సీజన్ మారుతోంది కాబట్టి ఈ సమయంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మలేరియాను వ్యాప్తి చేసే దోమలు ఎక్కువ అవుతాయి. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
Malaria Prevention and Precaution Tips : వాతావరణంలో మార్పులు జరిగే సమయంలో వివిధ ఆరోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. అలాంటివాటిలో మలేరియా కూడా ఒకటి. అయితే ఇది దోమల ద్వారా మనషులకు వ్యాపిస్తుంది. వాతావరణం మారే సమయంలో మలేరియాను వ్యాప్తి చేసే దోమలు పెరుగుతాయి. తేమ, వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో దోమలు పెరగకుండా, మలేరియా వ్యాప్తి ఎక్కువ కాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
దోమల ద్వారా వ్యాపిస్తుంది..
మలేరియా అనేది దోమల ద్వారా సంక్రమించే అంటువ్యాధి. కొన్ని ప్రాంతాల్లో ఇది ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. అందుకే దీనిని నియంత్రించడానికి, నిర్మూలించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. దీనిలో పురోగతిని సాధించినప్పటికీ.. మళ్లీ ముప్పు ఏర్పడుతుందని.. దానికి వాతావరణంలోని మార్పులే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అందుకే ఈ సమస్యను దూరం చేసుకునేందుకు జాగ్రత్తలు చేసుకోవాలనుకుంటున్నారు నిపుణులు.
కొత్త అధ్యయనం ప్రకారం మలేరియా వ్యాప్తిలో నీరు మేజర్ పాత్ర పోషిస్తుందని తేల్చింది. వేడిగా ఉండే ప్రాంతాల్లో వ్యాప్తి తక్కువగా ఉందని.. వెట్గా ఉండే ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అందుకే ఇప్పుడు దోమల సంతానోత్పత్తికి అనువైన ఉపరితల నీటి ఉనికిపై దృష్టి సారించారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వర్షం కురిసే చోట నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..
దోమలు కుట్టకపోతే మలేరియా రాదు. కాబట్టి దోమలు కుట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మలేయారను ఆడ అనాఫిలిస్ దోమలు ఎక్కువగా వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయంలో ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రూమ్లో దోమలు లేకుండా.. బెడ్ చుట్టూ దోమల తెరలు కట్టుకోవాలి. దోమలు కుట్టకుండా క్రీమ్స్, రోల్స్, కాయిల్స్ వాడొచ్చు. పిల్లల్ని బయటకి పంపే సమయంలో మరింత అలెర్ట్ ఉండాలి. వారికి దోమలకు కుట్టకుండా మాయిశ్చరైజర్స్, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసి బయటకు పంపాలి.
గది, కిటికీలకు మీరు మెష్ పెట్టుకోవచ్చు. దోమలు లోపలికి రాకుండా హెల్ప్ చేస్తాయి. ఫుల్ ప్యాంట్స్, పొడవాటి స్లీవ్స్, సాక్స్లు వేసుకోవాలి. లేత రంగు దుస్తులు దోమలను తక్కువగా ఆకర్షిస్తాయి కాబట్టి అలాంటి లైట్ కలర్స్ వేసుకుంటే మంచిది. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యం మొక్కల దగ్గర నీరు ఉండకుండా చూసుకోవాలి. మలేరియా వ్యాప్తి ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ మలేరియా వస్తే వెంటనే వైద్యుడి సలహాలు తీసుకుంటే మంచిది. ఇది మీరు మెరుగైన ఫలితాలు అందిస్తుంది.
మలేరియా లక్షణాలు ఇవే..
మలేరియా సోకిన వ్యక్తికి 10 రోజులకు మించి ఎలాంటి సంకేతాలు చూపించకపోవచ్చు. అయితే కొన్ని లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తలనొప్పి, శరీరంలో నొప్పులు, చలి ఎక్కువ అవ్వడం, అలసట, జ్వరం, చెమట, రక్తహీనత, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి మలేరియా లక్షణాలు. వీటిని గుర్తిస్తే వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. లేదంటే ఇది ప్రాణాంతకం కూడా అవ్వొచ్చు.
Also Read : నాన్స్టిక్ పాత్రల్లో వండుతున్నారా? అయితే జాగ్రత్త సంతానోత్పత్తి, థైరాయిడ్ సమస్యలు వస్తాయట