Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ స్టార్ సిటీ బైకుల ధర, మైలేజీ, ఫీచర్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. మీరు పూర్తి వివరాలు తెలుసుకున్నాక బైక్ కొనడానికి డిసైడ్ అవ్వండి.

GST తగ్గింపు తర్వాత భారత మార్కెట్లో బైక్‌లు, స్కూటర్లు, కార్లు మరింత చౌకగా మారాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర 73,903 రూపాయలుగా ఉంది. మరోవైపు, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus) ఎక్స్-షోరూమ్ ధర సుమారు 72,500 రూపాయలు. ఈ బైక్‌ల ఇంజిన్, పనితీరు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Hero Splendor Plus మైలేజ్ ఎంత?
అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ మోటార్‌సైకిల్‌లో ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, OHC ఇంజిన్ అమర్చారు. స్ప్లెండర్ ప్లస్‌లోని ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW పవర్, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో వస్తుంది.
Hero Splendor Plus ఒక లీటర్ పెట్రోల్‌తో సుమారు 70-73 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ 9.8 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ట్యాంక్ నింపితే సుమారు 700 కిలోమీటర్ల వరకు సులభంగా జర్నీ చేయవచ్చు. తక్కువ ధరలో మంచి మైలేజ్ అందించడం వల్ల ఈ బైక్‌ను బాగా ఇష్టపడి కొంటారు.
TVS Star City Plus మైలేజ్ ఎంత?
TVS బైక్‌లు మంచి మైలేజ్ కారణంగా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus) బైక్ BS-6 ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో 109 CC ఇంజిన్, 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, ఈ బైక్ లీటర్ పెట్రోలుకు 70 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
బైక్ ఇంజిన్ 7,350 rpm వద్ద 8.08 bhp గరిష్ట పవర్, 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో 17 అంగుళాల వీల్ ఉంది. ఇది ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది. ఈ విధంగా మీరు రెండు బైకుల ధర, ఫీచర్లు, మైలేజ్ గురించి తెలుసుకుని మీకు కావాల్సిన బైక్‌ను ఎంచుకోవచ్చు.
కొన్ని కంపెనీలు కొత్త ఏడాదిలో బైక్స్, కార్ల ధరలను పెంచుతున్నాయి. కనుక మీరు ధర గురించి తెలుసుకుని కొనడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది.






















