Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
TVS Jupiter vs Honda Activa | హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ స్కూటీలు మార్కెట్లో ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అయితే రెండింటితో ధర, మైలేజ్, ఫీచర్లలో మీకు ఏది బెస్ట్ ఇక్కడ తెలుసుకోండి.

భారత మార్కెట్లో టూ-వీలర్ సెగ్మెంట్‌లో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ స్కూటీలకు మంచి ఆదరణ ఉంది. ఈ రెండు టూ-వీలర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యాక్టివా, జూపిటర్ స్కూటర్లు ఒకే ప్రైస్-రేంజ్‌లో వస్తాయి. ఈ రెండు స్కూటర్ల ప్రారంభ ధర రూ.75 వేల కంటే తక్కువ. ఈ రెండు టూ-వీలర్ల పవర్, మైలేజ్, ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
హోండా యాక్టివా (Honda Activa)
హోండా యాక్టివా ఆరు కలర్ వేరియంట్స్‌లో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. హోండా యాక్టివా స్కూటర్ స్టాండర్డ్, DLX, స్మార్ట్ అనే మూడు వేరియంట్లలో మార్కెట్లో లభిస్తుంది. ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్‌లో హాలోజన్ హెడ్‌ల్యాంప్, DLX, స్మార్ట్ మోడల్స్‌లో LED హెడ్‌ల్యాంప్ అమర్చారు. ఈ టూవీలర్ స్మార్ట్ వేరియంట్‌లో మాత్రమే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్ ఇచ్చారు.
హోండా యాక్టివా స్టాండర్డ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,619 గా ఉంది. DLX మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 84,272 రూపాయలు కాగా, యాక్టివా స్మార్ట్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.87,944గా ఉంది. ఈ స్కూటర్‌లో 4 స్ట్రోక్, SI ఇంజిన్ అమర్చారు. హోండా యాక్టివా లీటరుకు గరిష్టంగా 60 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)
టీవీఎస్ జూపిటర్ 4 వేరియంట్లలో భారత మార్కెట్లో లభిస్తున్నాయి. స్పెషల్ ఎడిషన్, స్మార్ట్ Xonnect డిస్క్, స్మార్ట్ Xonnect డ్రమ్, డ్రమ్ అలాయ్ వేరియంట్స్ ఉన్నాయి. జూపిటర్ స్కూటర్ ఏడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 72,400 నుండి ప్రారంభమవుతుంది. టీవీఎస్ స్కూటర్‌లో సింగిల్-సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్ అమర్చారు. దీనితో 6,500 rpm వద్ద 5.9 kW పవర్, 5,000 rpm వద్ద 9.2 Nm టార్క్ లభిస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఒక లీటర్ పెట్రోల్‌లో 53 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని కంపెనీ చెబుతోంది.
టీవీఎస్ స్కూటర్‌లో 2 హెల్మెట్లు పెట్టుకునేంత స్పేస్ లభిస్తుంది. జూపిటర్ స్కూటర్ స్టైల్ విషయానికి వస్తే, దీనిలో టెయిల్ లైట్ బార్ ఇచ్చారు. ఈ టూ-వీలర్‌లో సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొందరు స్కూటర్ స్టార్ట్ చేసే ముందు సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోతుంటారు. దీని కోసం ఈ స్కూటర్‌లో సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇచ్చారు.
Also Read: TVS తొలి అడ్వెంచర్ బైక్ Apache RTX 300: నిజ జీవితంలో ఎంత మైలేజ్ ఇస్తుందంటే?






















