అన్వేషించండి

బైక్ ప్రియులకు పండగే: Kawasaki Ninja ZX-6R పై రూ. 3.72 లక్షల భారీ బెనిఫిట్స్!

నింజా ZX-6R మోడల్‌పై ఏకంగా రూ. 3.72 లక్షల విలువైన ప్రయోజనాలను ల‌భిస్తున్నాయి.. దీనివల్ల బైక్ ఆన్-రోడ్ ధర రూ. 15.43 లక్షల నుండి రూ. 12.69 లక్షలకు తగ్గింది. 

ప్రీమియం స్పోర్ట్స్ బైక్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవాసకి నింజా ZX-6R ఇప్పుడు భారీ డిస్కౌంట్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. మిడిల్‌వెయిట్ సూపర్‌స్పోర్ట్ విభాగంలో టాప్ గా ఉన్న ఈ బైక్‌పై ముంబైలో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. ఈ ఆఫర్ ద్వారా కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి భారీ మొత్తంలో నగదు ఆదా అయ్యే అవకాశం లభిస్తోంది. ఈక్ర‌మంలో మీరు బైక్ కొనాల‌నుకొంటే ముంబైలో కొంటే భారీ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. సో.. పారాహుషార్.. ఛ‌లో ముంబై అని, కవాస‌కి బైక్ ని తెచ్చుకోండి.

ధర, ఆఫర్ వివరాలు
సాధారణంగా ముంబైలో కవాసకి నింజా ZX-6R ఆన్-రోడ్ ధర సుమారు రూ. 15.43 లక్షలుగా ఉంటుంది. అయితే ప్రస్తుత డీలర్ లెవల్ ఆఫర్ల కారణంగా దీని ఎఫెక్టివ్ ఆన్-రోడ్ ధర రూ. 12.69 లక్షలకు తగ్గింది. అంటే కొనుగోలుదారులు ఏకంగా రూ. 3.72 లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ తగ్గిన ధరలో కేవలం బైక్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా, అదనపు యాక్సెసరీస్ ప్యాకేజీ కూడా కలిసి ఉండటం విశేషం. దీంతో ఈ బైక్ ను పొందాల‌నుకునే వారు ముంబైలో తీసుకుంటే చాలా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని తెలుస్తోంది. 

ఉచిత యాక్సెసరీస్ ప్యాకేజీ
ఈ డీల్‌లో భాగంగా దాదాపు రూ. 98,000 విలువ చేసే యాక్సెసరీస్ ప్యాకేజీని కేవలం రూ. 69,000 కే అందిస్తున్నారు, ఇది పైన పేర్కొన్న రూ. 12.69 లక్షల ధరలోనే కలిసి ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా బైక్ కింద పడినప్పుడు ఫ్రేమ్ , ఇంజిన్‌కు నష్టం కలగకుండా కాపాడే ఆర్‌అండ్‌జీ (R&G) ఫ్రేమ్ స్లైడర్లు, రేడియేటర్ దెబ్బతినకుండా రక్షణ ఇచ్చే రేడియేటర్ గ్రిల్ లభిస్తాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా హై-స్పీడ్ ప్రయాణాల్లో బైక్ స్టేబుల్ గా ఉండటానికి సహాయపడే ప్రసిద్ధ 'ఓలిన్స్ (Ohlins) స్టీరింగ్ డాంపర్'ను కూడా ఈ ఆఫర్‌లో భాగంగా ఉచితంగా అందిస్తున్నారు. దీంతో ల‌గ్జ‌రీ బైక్ ల‌వ‌ర్స్ కు ఇది పండగేన‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఇంజిన్ , పనితీరు
నింజా ZX-6R బైక్ 636సీసీ, ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 129 హెచ్‌పి శక్తిని , 69 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌లో కవాసకి క్విక్‌షిఫ్టర్ సౌకర్యం ఉంది, దీనివల్ల క్లచ్ వాడకుండానే వేగంగా గేర్లు మార్చుకోవచ్చు. సెక్యూరిటీ ప‌రంగా, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, వేర్వేరు పవర్ మోడ్స్ ,పూర్తిస్థాయి టీఎఫ్‌టీ (TFT) డిస్ప్లేను అమర్చారు. ఈ డిస్ప్లేను స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా మొబైల్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. తక్కువ ధరలో ప్రీమియం సూపర్ బైక్ అనుభూతిని కోరుకునే వారికి ఈ ఆఫర్ ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు. సో మరి లేటేందుకు, ఈ బైక్ కొనాలనుకునేవాళ్లు ముంబైలో తీసుకుంటే లాభ‌సాటిగా ఉంటుందని చెప్ప‌వ‌చ్చు. 

 

టాప్ హెడ్ లైన్స్

526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి
కియా సైరస్ EV వచ్చేస్తోంది - ఎన్ని వేరియంట్లు ఉన్నయి? వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తారు? పూర్తి వివరాలు
ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్
యూత్‌ మెచ్చిన ఏథర్ స్కూటర్లకు ఫ్రెష్‌ అప్‌డేట్‌ - చిన్న బ్యాటరీలతోనే సేమ్‌ రేంజ్, ఛార్జింగ్‌లో మరింత వేగం!
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?
మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ ఎంట్రీకి మరో 10 రోజులు కూడా లేదు - కొత్త ఇంజిన్‌తో పాటు మిడిల్‌క్లాస్‌ మెచ్చే ఫీచర్లు!
మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!
మీ కారులో ఈ స్మార్ట్ గాడ్జెట్లు ఉన్నాయా? సేఫ్టీ నుంచి స్టైల్ వరకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మారిపోతుంది!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget