అన్వేషించండి

Cooking in Non Stick Pans is Dangerous : నాన్​స్టిక్ పాత్రల్లో వండుతున్నారా? అయితే జాగ్రత్త సంతానోత్పత్తి, థైరాయిడ్ సమస్యలు వస్తాయట

cooking in Non Stick Pans : వండుకునేందుకు ఈజీగా.. క్లీన్​ చేసేందుకు సులభంగా ఉంటాయి నాన్​స్టిక్ పాత్రలు. అందుకే వీటిలో ఎక్కువమంది కుక్ చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఆహారం విషమైపోతుందట..

Dietary Guidelines for Indians 2024 : నాన్​స్టిక్ పాత్రలతో ఎప్పటినుంచో వ్యతిరేకత ఉన్నా.. ఇప్పటికీ వాటిని చాలామంది ఉపయోగిస్తారు. వంట చేసుకోవడానికి నాన్​ స్టిక్​ చాలా ఈజీగా ఉందని, నూనె తక్కువ అవసరమే ఉంటుందని, క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ శ్రమ అవసరం లేదని దాదాపు చాలామంది వీటిని వాడుతారు. అయితే నాన్​స్టిక్​ పాత్రల్లో వండుకుంటే తీవ్రమైన ఆరోగ్యసమస్యలు వచ్చే ప్రమాదముందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. అంతేకాకుండా ఇదే అంశంపై మరిన్ని విషయాలు లేవనెత్తింది. అదేంటంటే.. 

సంతానోత్పత్తి సమస్యలు

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ICMR కలిసి.. నాన్​స్టిక్ పాత్రల వినియోగంపై అధ్యయనం చేశారు. ఈ స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ ఫలితాలతో నాన్​స్టిక్ పాన్​లలో వంట చేయకూడదని.. ICMR హెచ్చరించింది. ఎందుకంటే దానివల్ల కలిగే దుష్ప్రభావాలు అంత తీవ్రమైన ఆందోళనలు ఇస్తుందని తెలిపింది. నాన్​స్టిక్ పాత్రల్లో వండుకుని తినడం వల్ల హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు తలెత్తవచ్చని ICMR  తెలిపింది. అందుకే నాన్​స్టిక్ పాత్రలకు బదులుగా మట్టిపాత్రల్లో వండుకోవడం అత్యంత సురక్షితమని తెలిపింది. 

ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి

నాన్​స్టిక్ కుక్​వేర్​లలో టెఫ్లాన్​ వంటి నాన్ స్టిక్ కోటింగ్​లు ఉంటాయి. వీటిని వినియోగించే కొద్ది అవి ఆహారంలో కలిసిపోతూ ఉంటాయి. వీటిని అధిక ఉష్ణోగ్రతల్లో వేడి చేసినప్పుడు పెర్​ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్, పెర్​ఫ్లోరోక్టానెసల్ఫోనిక్ యాసిడ్​లను విడుదల చేస్తుంది. ఈ రసాయానాలు వంటలోనే కాకుండా.. గాలిలోకి విడుదలై ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. ఈ పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, థైరాయిడ్ వంటి రుగ్మతలు, పలు రకాల క్యాన్సర్​లు వచ్చే అవకాశముందని చెప్తోంది. 

ఒక్క గీతలో తొమ్మిదివేలకు పైగా మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదల

నాన్​స్టిక్ వంట పాత్రలపై చిన్న గీత పడినా.. దాని మీద ఉన్న టెఫ్లాన్ వల్ల వాయువులో, వంటలో కొన్ని కెమికల్స్ కలుస్తాయి. ఒక్క గీత నుంచి సుమారు 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతున్నాయని ICMR పేర్కొంది. నాన్​స్టిక్​ను 170 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. నాన్​స్టిక్​ కడిగేప్పుడు కూడా పాత్రలపై బోలేడు గీతలు పడతాయి. ఇవి లక్షల్లో మైక్రోప్లాస్టిక్స్​ను విడుదల చేస్తాయని కూడా వెల్లడించింది. 

నాన్​స్టిక్​కు ఇవే ప్రత్యామ్నాయం

అందుకే పర్యావరణ హిత పాత్రల్లో వంట చేసుకోవాలని ICMR సూచించింది. నాన్​స్టిక్​కు ప్రత్యామ్నాయంగా మట్టి, గ్రానైట్ వంటి పాత్రల్లో వండుకుంటే మంచిదని సూచించింది. అయితే వాటిపై ఎలాంటి కెమికల్ పూతలు లేకుండా ఉండాలని తెలిపింది. సిరామిక్ వంటపాత్రలు.. సాంప్రదాయ నాన్​స్టిక్ పాత్రల మాదిరిగానే ఉంటాయని.. కానీ వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఇవన్నీ పర్యావరణానికి హితమైనవి, ఆరోగ్యంపై కూడా ఎలాంటి దుష్ప్రభావాలు చూపించవని తెలిపింది. 

Also Read : సూసైడ్ ఆలోచనలను రెట్టింపు చేస్తున్న గంజాయి.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Embed widget