అన్వేషించండి

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

Hyderabad Police | జూబ్లీహిల్స్ జోన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎం యాదగిరిపై పోలీస్ శాఖ క్రమశిక్షణా చర్యలో భాగంగా సస్పెండ్ చేయడంతో ఆత్మహత్య డ్రామా చేశారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర పోలీస్ ఉన్నతాధికారులపై ఒక కానిస్టేబుల్ చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎం. యాదగిరి (PC 6211) చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని అధికారులు తెలిపారు. యాదగిరిపై విధి నిర్వహణలో పలు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, ఆయన తరచుగా రోల్ కాల్స్‌కు గైర్హాజరు కావడం, డ్యూటీ సమయంలో రెస్ట్ రూమ్‌లో నిద్రపోవడం, యూనిఫామ్ నిబంధనలు పాటించకపోవడం వంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.

సస్పెండ్ చేశారనే కానిస్టేబుల్ ఆత్మహత్య డ్రామా..

ముఖ్యంగా, స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు రావడంతో, పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆయన తీరు మార్చుకోకపోవడంతో శనివారం నాడు నగర పోలీస్ కమిషనర్ ఆయనను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్న తర్వాత తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే యాదగిరి ఆత్మహత్య డ్రామాకు తెరతీశారని అధికారులు ధ్వజమెత్తారు. శనివారం మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి, అధికారులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారని వారు తెలిపారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన విడుదల చేసిన వీడియో కేవలం ఒక కల్పిత నాటకమని, ఉద్దేశపూర్వకంగానే పోలీస్ వ్యవస్థపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

గతంలో తప్పుడు వీడియోతో సస్పెన్షన్ వేటు

యాదగిరికి గతంలోనూ ఇటువంటి అలవాట్లు ఉన్నాయని పోలీస్ శాఖ వివరించింది. గతంలో ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసేటప్పుడు చిరు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడి, మొబైల్ డ్యూటీ నుంచి తప్పించినప్పుడు కూడా ఇలాగే సోషల్ మీడియాలో తప్పుడు వీడియో పెట్టి సస్పెండ్ అయ్యారని గుర్తుచేశారు. అలాగే మోఘల్‌పురా మరియు బోరబండ ఔట్‌పోస్ట్‌లో పనిచేసిన సమయంలోనూ అవినీతి కార్యకలాపాలు, బెల్ట్ షాపులు, వైన్ షాపుల నిర్వాహకులను వేధించడం వంటి పనులకు పాల్పడినట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు.

బాధ్యతాయుతమైన పోలీస్ వృత్తిలో ఉంటూ పదేపదే ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకే కానిస్టేబుల్ యాదగిరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వాస్తవాలను వక్రీకరించి అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలా యాదగిరి సర్క్యులేట్ చేస్తున్న కల్పిత వీడియోను ఎవరూ నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ శాఖ కోరింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget