అన్వేషించండి

Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

Jupally Krishna Rao | వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా శివారులో కాలువకు ఏర్పడిన గండిని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం పరిశీలించారు. ఆరేళ్లయినా మరమ్మతులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rajiv Bhima Lift Irrigation Scheme | వీపనగండ్ల: రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ (ప్యాకేజీ-16) ప్రధాన కాలువ తెగిపోయి ఆరేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి శనివారం నాడు వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా శివారులో కాలువకు ఏర్పడిన గండిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారుల తీరును తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు.


Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

కాగితాల్లో చూపడం కాదంటూ అధికారులపై మంత్రి ఫైర్

రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సుమారు 76.825 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ కాలువ ద్వారా దాదాపు 16,666 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు అధికారులు కాగితాల్లో చూపుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. కానీ, వాస్తవానికి 62.25 కిలోమీటర్ల వద్ద 2019, జూలై 23న కాలువ తెగిపోయిందని, అప్పటి నుంచి నేటి వరకు మరమ్మతులు చేయకుండా సాగునీరు అందుతున్నట్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపడమేమిటని అధికారులను నిలదీశారు. కాలువ తెగిపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందక తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువచ్చారు.


Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

కాంట్రాక్టర్లదే పూర్తి బాధ్యత.. మంత్రి జూపల్లి

ఈ పనులను ఈపీసీ (EPC) ఒప్పందం కింద చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య కుదిరిన ఒప్పందం ఇంకా ముగియలేదని, పనులు కూడా అధికారికంగా పూర్తి కాలేదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల కాలువ మరమ్మతులు సహా మిగిలిన పనులన్నింటికీ కాంట్రాక్టరుదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పారు. తక్షణమే కాలువ గండిని పూడ్చి, మిగిలిన కాలువలు, మైనర్లు, సబ్ మైనర్ పనులను పూర్తి చేసి చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG Inter Results 2026 Link: ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా
Telangana Inter Results 2026 link: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
Singer Mangli : లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
HYDRA Demolitions: రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
Advertisement

వీడియోలు

Payyavula Kesav on Botsa | జగన్ విషయంలో బొత్స అన్నమాటలనే కదా మేం చెప్పాం
Vybhav Sooryavanshy: హేజిల్‌వుడ్డా.. గాడిదగుడ్డా...? Title:దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తున్న వైభవ్
Accident on Vijayawada Highway: విజయవాడ హైవేపై BMWపై బోల్తా పడిన ట్యాంకర్
Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Inter Results 2026 Link: ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా
Amaravati News: అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
Macherla ASI Suspension: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
US Iran Peace Talks: అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
IPL 2026 CSK VS DC Result Update: ఎట్ట‌కేల‌కు చెన్నై బోణీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన సీఎస్కే.. స‌త్తా చాటిన ఓవ‌ర్ట‌న్.. ఢిల్లీకి వ‌రుస‌గా రెండో ఓట‌మి
ఎట్ట‌కేల‌కు చెన్నై బోణీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన సీఎస్కే.. స‌త్తా చాటిన ఓవ‌ర్ట‌న్.. ఢిల్లీకి వ‌రుస‌గా రెండో ఓట‌మి
Telangana Inter Results 2026 link: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
Roja supports DMK: కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
Embed widget