అన్వేషించండి

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!

Jagityala: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయని ఆయనంటున్నారు.

Congress to suffer a major shock in Jagityala:  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది.  జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో జీవన్ రెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ కు మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. గత ఎన్నికల్లో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలవగా, జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే, అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం, ఆయనకు ప్రభుత్వం , పార్టీలో ప్రాధాన్యత పెరగడం జీవన్ రెడ్డికి మింగుడుపడటం లేదు. తనను సంప్రదించకుండానే బద్ధ శత్రువును పార్టీలోకి తీసుకోవడం తనను అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.  పార్టీపై ఆయన చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 

కేసీఆర్‌తో భేటీకి రంగం సిద్ధం 

ఇటీవల ఆయన తాను పార్ట మారే ఆలోచనలో ఉన్నానని చెబుతున్నారు. ఈ క్రమంలో  జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్‌ తో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఆయన హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసి, గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జగిత్యాలలోని తన అనుచరులతో, కీలక నేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ మార్పుపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ పూర్తి చేశారని, మెజారిటీ అనుచరులు ఆయన నిర్ణయానికి మద్దతు తెలిపారని సమాచారం.

కాంగ్రెస్ బుజ్జగింపులు విఫలం 

జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, సంజయ్ కుమార్ విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్నారు.  దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే, ప్రత్యర్థిని తెచ్చి నెత్తిన కూర్చోబెట్టడం ఏమిటి  అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ పరిణామా కారాణం ఆయన వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని చెబుతున్నారు.  ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరితే, జగిత్యాల నియోజకవర్గంలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. కాంగ్రెస్ కేడర్‌లో చీలక రావడం ఖాయం. అటు బీఆర్ఎస్‌కు ఈ సీనియర్ నేత రాక పెద్ద బలాన్ని ఇస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ మారే అంశంపై జీవన్ రెడ్డి నుంచి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత 

కాంగ్రెస్ పార్టీతో  తాటిపర్తి జీవన్ రెడ్డికి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా విడదీయలేని అనుబంధం ఉంది. 1980వ దశకంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, జగిత్యాల నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, భవనాల శాఖ వంటి కీలక మంత్రి పదవులను నిర్వహించిన జీవన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. ఓటమి ఎదురైనప్పుడు కూడా పార్టీని వీడకుండా విధేయుడిగా ఉన్న ఆయన తెలంగాణ ఉద్యమం తర్వాత వెనుకబడిపోయారు. వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు.  

టాప్ హెడ్ లైన్స్

Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Cancel Free Bus Scheme: 'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget