అన్వేషించండి

Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

ఏపీ, తెలంగాణలో మరోసారి అకాల వర్షాలు కురవనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారబోతోంది. మార్చి 15 వరకు ఎండ తీవ్రత కొనసాగి, పొడి వాతావరణం ఉన్నప్పటికీ, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం నాడు వర్షాలు మొదలైనప్పటికీ మార్చి 16 నుండి 20 మధ్య రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు (Hailstorms) కురిసే అవకాశం ఉంది.

 మార్చి 17, 18, 19 తేదీల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ అకాల వర్షాల కారణంగా ఈ ఏడాది ఉగాది, రంజాన్ వేడుకలు వర్షంలోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చు.

2023లో మార్చి 16-19 తేదీలో తెలంగాణలో కురిసిన భారీ వడగళ్ల వానలు మనందరికీ గుర్తే ఉంటాయి. అప్పట్లో  రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ప్రజలను ఇబ్బంది పెట్టింది. సరిగ్గా మూడేళ్లకు అదే తరహా పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి 15 నుండి తెలంగాణతో పాటు హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈసారి కూడా తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయి. భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందో తెలిపే 'ఇంపాక్ట్ మ్యాప్' ఆదివారం  విడుదల కానుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా వాతావరణ సమాచారం
తెలంగాణ:
రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా తగ్గి, మేఘావృతమైన వాతావరణం ఏర్పడనుంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వానల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం నుండి వాతావరణంలో మార్పులు మొదలయ్యే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్:
కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణకు ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సోమవారం నుంచి ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పిడుగులకు ఛాన్స్

తెలంగాణలో మార్చి 16-20 తేదీల మధ్యలో చాలా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గరిష్ట తీవ్రత తెలంగాణ లో మార్చి 18-19 తేదీలలో ఉండబోతుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

.రైతులు తమ పంటలను వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలు నుండి కాపాడుకోవాల్సి ఉంటుంది. తమ పంటలను godown, cold storage units లో భద్రపరచుకోవాలని సూచించారు.  వర్షం కురిసే సమయంలో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కనుక వర్షం కురిసే సమయంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని.. వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget