Rishabh Pant Ruled out T20 World Cup: గత టీ20 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకం.. రిషబ్ పంత్ సహా చోటు దక్కని 5 మంది స్టార్లు వీరే
Rishabh Pant Dropped from India squad T20 World Cup | టి20 ప్రపంచ కప్ 2026 కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సహా 5 మంది కీలక ఆటగాళ్లు లేరు.

shubman gill dropped from India squad | రిషబ్ పంత్, శుభమన్ గిల్ T20 ప్రపంచ కప్ ఆడనున్న భారత జట్టులో భాగం కాదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) డిసెంబర్ 20న ప్రపంచ కప్ 2026 కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అందులో శుభమన్ గిల్, రిషబ్ పంత్ లాంటి కీలక ఆటగాళ్లు లేరు. దాంతో అభిమానులు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. గత 2-3 నెలలుగా గిల్ T20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నందున బీసీసీఐ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. గిల్‌తో పాటు, టీ20 ప్రపంచ కప్ జట్టు నుండి పలు స్టార్ క్రికెటర్లు కూడా చోటు దక్కించుకోలేకపోయారు. 2026 టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం దొరకని భారత స్టార్ ఆటగాళ్ల జాబితా ఇక్కడ చూడండి.
ప్రపంచ కప్ స్క్వాడ్ నుండి 5 పెద్ద స్టార్‌లు దూరం
శుభమన్ గిల్ - 2026 టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ నుండి దూరమైన అతిపెద్ద పేరు శుభమన్ గిల్. ఈ ఏడాది ఆగస్టు 2025లో T20 జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుండి గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. దురదృష్టవశాత్తూ గత కొన్ని మ్యాచ్‌లలో గిల్ T20 ఫామ్ చాలా పేలవంగా ఉంది. ఈ ఏడాది ఆడిన T20 మ్యాచ్‌లలో గిల్ ఒక్క అర్ధశతకం కూడా చేయలేదు.
రిషబ్ పంత్ - టీ20 వరల్డ్ కప్ జట్టులో కనిపించని రెండవ పెద్ద పేరు రిషబ్ పంత్. అతను టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ అయినప్పటికీ T20 స్క్వాడ్‌లో రెగ్యులర్‌గా సభ్యుడు కాదు. వికెట్ కీపర్‌గా సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లకు 2026 టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లో స్థానం లభించింది. పంత్ లేకపోవడంతో శాంసన్‌కు ప్లేయింగ్ XIలో చోటు దక్కుతుంది. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ దాదాపు దక్షిణాఫ్రికా చేతిలోకి వెళ్తుంటే కీపింగ్ చేస్తున్న పంత్ ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. ఫిజియో వచ్చి అతడికి ట్రీట్మెంట్ చేసి బ్యాండేజ్ వేసి వెళ్తాడు. అదే మ్యాచ్ మూమెంటమ్ మార్చి, భారత్‌ను పొట్టి ప్రపంచ కప్ విజేతగా మార్చింది. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. కోహ్లీ, రోహిత్ లాంటి ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినా పంత్‌కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు.
యశస్వి జైస్వాల్ - 2024 T20 ప్రపంచ కప్ ఛాంపియన్ ఇండియా జట్టులో యశస్వి జైస్వాల్ భాగంగా ఉన్నాడు. అంతర్జాతీయ T20 క్రికెట్‌లో 36 సగటు, 164.31 స్ట్రైక్ రేట్‌తో ఉన్నప్పటికీ జైస్వాల్‌కు జట్టులో స్థానం దక్కకపోవడం దురదృష్టకరం. అయితే, భారత స్క్వాడ్‌లో ఓపెనింగ్ కోసం అనేక ఇతర ఎంపికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జైస్వాల్‌ను స్క్వాడ్‌లో చేర్చలేకపోయారు. గిల్ దూరం కావడంతో ఆ స్థానంలో జైస్వాల్ ను తీసుకున్నా నష్టం లేదు.
మహ్మద్ సిరాజ్ - మహ్మద్ సిరాజ్ చివరిసారిగా జనవరి 2025లో భారత్ తరపున అంతర్జాతీయ T20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్‌గా T20 జట్టులో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ కోసం పేస్ అటాక్ బాధ్యతను BCCI జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు అప్పగించింది. స్క్వాడ్‌ను చూస్తే గంభీర్ నిర్ణయంతో T20 జట్టులో సిరాజ్ స్థానంలో హర్షిత్ రాణాకు అవకాశాలు లభిస్తున్నాయని ఫ్యాన్స్ వాపోతున్నారు.
జితేష్ శర్మ - జితేష్ శర్మ కూడా టీ20 వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలపై T20 సిరీస్‌లలో సంజు శాంసన్ బెంచ్‌పై కూర్చున్నా వికెట్ కీపర్‌గా జితేష్ శర్మ ఆడాడు. వరుసగా 2 సిరీస్‌లు ఆడిన తర్వాత జితేష్ శర్మను జట్టు నుంచి తొలగించారు. రెండవ వికెట్ కీపర్‌గా ఇటీవల దేశవాలీలో ఝార్ఖండ్ జట్టును విజేతగా నిలిపిన ఇషాన్ కిషన్‌కు జట్టులో స్థానం లభించింది.
T20 ప్రపంచ కప్ కోసం భారత స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.





















