Suryakumar Yadav Batting Ind vs SA Series | బ్యాటర్‌గా విఫలమయ్యానన్న సూర్యకుమార్
ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమ్ ఇండియా సిరీస్ ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే సిరీస్ గెలవడంపై, అలాగే తన బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 12, 5, 12, 5 పరుగులు మాత్రమే చేసాడు. ఈ విషయంపై మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌లో బహుశా మేం సాధించలేనిది ఒక్కటే.. 'సూర్య’ అనే బ్యాటర్‌ను ఫైండ్ అవుట్ చేయలేక పొయ్యాము. తను ఎక్కడో మిస్ అయ్యాడు. కానీ, కచ్చితంగా బలంగా తిరిగి వస్తాడు. ఒక టీమ్ గా మా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని జట్టును గెలిపించారు. కెప్టెన్‌గా ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది" అని అన్నాడు.
"సిరీస్ ప్రారంభం నుంచే అగ్రసివ్ గా ఆడాలని అనుకున్నాం. దానికే కట్టుబడి ఉన్నాం. ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. మా బ్యాటర్లు అదే దూకుడును ప్రదర్శించారు. ఫలితాలు మీ ముందు ఉన్నాయి" అని వివరించాడు. బౌలింగ్ వ్యూహాల గురించి మాట్లాడుతూ బుమ్రాను పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో ప్లాన్ ప్రకారమే ఉపయోగించామని, వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతంగా రాణించాడని ప్రశంసించారు.





















