Ind vs Nz T20 Series: న్యూజిలాండ్ టి20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..గిల్, జితేష్‌లకు షాక్.. ఇద్దరు రీఎంట్రీ
India vs New Zealand T20 Series | న్యూజిలాండ్‌తో జనవరి 21 నుండి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్, జితేష్ శర్మలను పక్కనపెట్టింది.

shubman gill Ruled out for T20 Series against Ind vs NZ | వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో ఆడబోయే 5 టీ20ల సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. అయితే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, బ్యాటర్ రింకూ సింగ్‌లకు అవకాశం వరించింది. అలాగే, జితేష్ శర్మకు సైతం ఈ సిరీస్‌లో చోటు దక్కలేదు. గిల్, జితేష్ స్థానంలో రింకూ సింగ్, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారు..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ జనవరి 21 న ప్రారంభం కానుంది. జనవరి 31తో చివరి టీ20 జరుగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టు 2026 టీ20 వరల్డ్ కప్ ఆడుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. జితేష్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ను టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తొలగించారు. వారికి బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు.
న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు భారత జట్టు- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
BCCI 2026 టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్‌తో టీ20ల సిరీస్‌కు నలుగురు బ్యాట్స్‌మెన్, ఇద్దరు వికెట్ కీపర్లు, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు, ఇద్దరు పేస్ బౌలర్ ఆల్ రౌండర్లు, ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. 2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లకు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని BCCI ఆల్ రౌండర్లు, స్పెషలిస్ట్ బ్యాటర్లు, వికెట్ కీపర్ బ్యాటర్లు, స్పిన్నర్లు, పేసర్లు కలిపి మొత్తం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఇండియా vs న్యూజిలాండ్ T20 సిరీస్ 2026 షెడ్యూల్
- జనవరి 21 - 1వ T20: జామ్తా (రాత్రి 7 గంటలకు)
- జనవరి 23 - 2వ T20: రాయ్‌పూర్ (రాత్రి 7 గంటలకుT)
- జనవరి 25 - 3వ T20: గౌహతి (రాత్రి 7 గంటలకు)
- జనవరి 28 - 4వ T20: విశాఖపట్నం (రాత్రి 7 గంటలకు)
- జనవరి 31 – 5వ టీ20: తిరువనంతపురం (రాత్రి 7 గంటలకు)
ఇషాన్ కిషన్, రింకూ సింగ్‌ల రీఎంట్రీ..
న్యూజిలాండ్ టీ20 సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ జట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కిషన్ 500కు పైగా పరుగులు చేశాడు. జితేష్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే, రింకూ సింగ్ కూడా జట్టులోకి రాబోతున్నాడు. రింకూ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత జట్టులో లేడు. ఫామ్ లేమితో సతమతం అవుతున్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను కివీస్‌తో భారత టీ20 జట్టు నుంచి, టీ20 వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేయలేదు.





















