Vrusshabha Tralier : 'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
Vrusshabha Trailer Reaction : మలయాళ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ హిస్టారికల్ డ్రామా 'వృషభ' ట్రైలర్ వచ్చేసింది. పాన్ ఇండియా లెవల్‌లో ఈ నెల 25న మూవీ రిలీజ్ కానుంది.

Mohan lal's Vrusshabha Trailer Out Now : మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ అవెయిటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'వృషభ'. వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
'వృషభ' మహారాజుగా...
ఈ మూవీలో రెండు పాత్రల్లో మోహన్ లాల్ కనిపించనున్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ప్లాష్ బ్యాక్‌లో రాజా విజయేంద్ర 'వృషభ'గా... ప్రజెంట్ ఓ తండ్రి పాత్రలో ఓ ఫేమస్ బిజినెస్ మ్యాన్‌గా కనిపించనున్నారు. 'తన కలల్లో హింస, రక్తపాతం, యుద్ధం వంటి విషయాలు అతన్ని ఆకట్టుకునేలా అవుతున్నాయి.' అనే డైలాగ్‌తో మోహన్ లాల్ గత చరిత్రను చూపించడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 'తను మాట్లాడిన ప్రతీ మాటకు నా ఖడ్గమే సమాధానం చెబుతుంది.', 'వృషభ మహారాజుకు ఎదురెళ్లడం అంటే మాట్లాడినంత సులభం కాదు' అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
ప్లాష్ బ్యాక్‌లో రాజ్యం, యుద్ధం, కనిపించని మరో చరిత్రతో పాటు ప్రస్తుతం తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను అద్భుతంగా చూపించారు. అసలు 'వృషభ' ఎవరు, ఆ కలలకు లింక్ ఏంటి? తండ్రి బాధను చూసిన కొడుకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... డార్లింగ్ వస్తారా?
ఈ మూవీకి నంద కిశోర్ దర్శకత్వం వహించగా... మోహన్ లాల్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక నటించారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ చాలా హృద్యంగా చూపించారు. వీరితో పాటే సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, అజయ్, నయన్ సారిక, నేహా సక్సేనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ నెల 25న రిలీజ్ కానుంది. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సికె పద్మకుమార్, వరుణ్ మాథూర్, సౌరభ్ మిశ్రా, విశాల్ గుర్నానీ, అభిషేక్ ఎస్ వ్యాస్, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు.
A Love & Bond So Strong. It Defies Death ❤️🔥
— Geetha Arts (@GeethaArts) December 20, 2025
The Roar of King #Vrusshabha in the Most Epic Way 💥#VrusshabhaTelugu Trailer Out Now
▶️ https://t.co/4QcWspLPSx#VrusshabhaOn25thDecember - Release by #GeethaFilmDistributors
Complete Actor @mohanlal #SamarjitLankesh @ursnayan… pic.twitter.com/bQmiDbABkG





















