టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
టీమిండియా, సౌతాఫ్రికా జట్లు ఆఖరి పోరుకు సిద్ధం అవుతున్నాయి. భారత్ లో సఫారీల సుదీర్ఘ పర్యటన ఈరోజుతో ముగియనుంది. ఈరోజు శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా 5త్ అండ్ ఫైనల్ t20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ గెలవాలని రెండు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. ఒకపక్క ఆల్రెడీ 5t20ల సిరీస్లో 2-1 తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ పట్టీయాలని పట్టుదలగా ఉంటే.. సిరీస్ గెలిచే ఛాన్స్ లేకపోయినా.. కనీసం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది సఫారీ జట్టు.
ఇదిలా ఉంటే గాయం కారణంగా subhman gill ఈ మ్యాచ్ కు దూరం కాగా.. Sanju Samson opener గా బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ కు.. అటు కెప్టెన్ గా.. ఇటు బ్యాటర్ గా ఇది ఆఖరి ఛాన్స్ లా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఆడకపోతే అతడి కెరీరే Dangerలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.





















