టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఎవ్వరూ ఊహించని షాకింగ్ కామెంట్స్ చేశాడు. గంభీర్ అసలు భారత జట్టుకు కోచే కాదని, మేనేజర్ మాత్రమేనని దిమ్మతిరిగే కామెంట్స్ చేశాడు. ‘మోడ్రన్ క్రికెట్లో కోచ్ అనే పదాన్ని తప్పుగా యూజ్ చేస్తున్నారు. కోచ్ అంటే స్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్ నేర్పేవాళ్లు మాత్రమే. అయినా కోచ్ అనే పేరు ఇచ్చినంత మాత్రాన ఆ రోల్‌లో అందరూ అద్భుతంగా పనిచేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్.. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అనుకుంటే.. లెగ్‌స్పిన్నర్ లేదా వికెట్ కీపర్‌కి గంభీర్ ఎలా కోచ్ అవుతాడు? అందుకే ఈ రోజుల్లో కోచ్ పాత్ర ఆటగాళ్ల బాగోగులు చూసుకోవడం తప్ప.. కోచింగ్ విషయంలో ఏం లేదు.
అందుకే గౌతం గంభీర్‌ని కూడా కోచ్ అనేకంటే మేనేజర్ అనడమే కరెక్ట్.’ అంటూ కపిల్ దేవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే కపిల్ దేవ్ అక్కడతో ఆగకుండా.. ఇప్పుడున్న గంభీర్ లాంటి మేనేజర్ల పని.. ఆటగాళ్లను ప్రోత్సహించడం.. వాళ్లలో ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి రగిలించడమేనని, జట్టులో వాళ్ల రిలాక్స్‌డ్‌గా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడమేనని.. మరి ఆ పని తాను కరెక్ట్‌గా నిర్వహిస్తున్నాడో లేదో గంభీర్ ఆలోచించుకోవాలని అనడం ఇప్పుడు పెద్ద చర్చకు దరి తీసింది. మరి దీనిపై గంభీర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.





















