MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ ను ఓడించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ బౌలర్ లారెన్ బెల్ వేసిన తొలి ఓవర్ మెయిడెన్ కావడంతో ముంబై ఒత్తిడిలో పడింది. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సజీవన్ సజన, నికోలా కేరీ 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో ముంబై స్కోర్ 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ముంబై బౌలర్లు గట్టి పోటీ ఇచ్చారు. ఆఖరి ఓవర్లో డీ క్లెర్క్ చివరి 4 బంతుల్లో 2 సిక్సులు, 2 ఫోర్లు కొట్టి టీమ్ కు విజయాన్ని అందించింది.





















