Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
US Iran War | దక్షిణ శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి చేసి హిందూ మహాసముద్రంలో ముంచేసింది. ఈ దాడిలో 87 మంది చనిపోగా, మరో వంద మంది వరకు గల్లంతయ్యారు.

కొలంబో/వాషింగ్టన్: అమెరికా -ఇజ్రాయెల్ సైన్యంతో ఇరాన్ ఆర్మీ పోరాడుతోంది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో శ్రీలంక దక్షిణ తీరం నుంచి వెళుతున్న ఒక ఇరాన్ యుద్ధ నౌక (IRIS Dena)పై అమెరికా సబ్ మెరైన్ దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారని అమెరికా పేర్కొంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన యుద్ద నౌకపై తాము జరిపిన దాడికి సంబంధించిన వీడియోను అమెరికా సైన్యం విడుదల చేసింది.
87 మృతదేహాలు లభ్యం
ఇరాన్ యుద్ధ నౌకలో మొత్తం 180 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. నివేదికల ప్రకారం, ఇరాన్ నౌక నుండి ప్రమాద సంకేతం అందిన వెంటనే, శ్రీలంక సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. సముద్రంలో మునిగిపోయిన ఇరాన్ యుద్ధ నౌక నుంచి శ్రీలంక నేవీ 87 మృతదేహాలను స్వాధీనం చేసుకుంది.
#WATCH | The US military releases the visuals of the attack on an Iranian warship in the Indian Ocean.
— ANI (@ANI) March 4, 2026
(Visual Source: Department of War) https://t.co/a5JmdAOUEh pic.twitter.com/IqcqtkhMP6
శ్రీలంక విదేశాంగ మంత్రి సమాచారం
వార్తా సంస్థ PTI ప్రకారం, బుధవారం (మార్చి 4) నాడు శ్రీలంక తన దక్షిణ తీరంలో మునిగిపోయిన ఇరాన్ నేవీ షిప్ నుంచి దాదాపు 32 మంది పౌరులను రక్షించార. చాలా మృతదేహాలను లంక నేవీ వెలికితీసింది. విదేశాంగ మంత్రి విజిథ హెరాత్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఉదయం 5 గంటల 8 నిమిషాలకు గాలే దక్షిణ తీరంలో దాదాపు 40 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఐరిస్ డెనా (IRIS Dena) అనే నౌక మునిగిపోయిందని సమాచారం అందింది. సమాచారం అందుకున్న శ్రీలంక నేవీ, ఆర్మీ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
భారత్‌లో నేవీలో విన్యాసాలలో పాల్గొంది
ఇరాన్ నౌక ఇటీవల భారత్ నిర్వహించిన అంతర్జాతీయ నేవీ విన్యాసాలలో పాల్గొంది. అయితే, భారత నేవీ దీనిపై స్పందించలేదు. శ్రీలంక విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ప్రమాద సంయంలో నౌకలో మొత్తం 180 మంది ఉన్నారని తెలిపారు. నేవీ, ఆర్మీ అక్కడికి వెళ్లి చూసేసరికి కొందరు వ్యక్తులు నీటిలో మునిగిపోగా, కొందరు ఈదుతూ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే వారికి అక్కడ యుద్ధనౌక లాంటివి కనిపించలేదని స్పష్టం చేశారు. ఎందుకంటే కేవం ఇరాన్ నౌకపై అమెరికా సబ్ మెరైన్ దాడిచేయడం మాత్రమే కాదు, నీళ్లల్లో ముంచివేసిందని అమెరికా అధికారులు ఓ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు.
This Iranian warship thought it was safe in international waters. It wasn't.
— The White House (@WhiteHouse) March 4, 2026
The @DeptofWar is fighting to win. 🇺🇸 pic.twitter.com/4bGMubuSQu
అమెరికా రక్షణ కార్యదర్శి ప్రకటన
అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ దాడిపై స్పందించారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా సబ్‌మెరైన్ ఓ ఇరాన్ నేవీ నౌకపై దాడిచేసి, ముంచివేసిందని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత శత్రు నౌకను టార్పెడోతో ముంచేయడం ఇదే తొలిసారి అని తెలిపారు.
























