అన్వేషించండి

The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్

The Raja Saab Review : డార్లింగ్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. 'ది రాజా సాబ్' మూవీలో తాజాగా 8 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తున్నట్లు చెప్పారు.

Director Maruthi Reaction On Prabhas The Raja Saab Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీలో ఓల్డ్ గెటప్ మిస్ కావడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్, టీజర్లలో చూపించిన ఈ సీన్స్ మూవీకే హైలెట్ అని అవి మూవీలో ఎక్కడా లేవంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా బ్లాక్ బస్టర్ మీట్‌లో డైరెక్టర్ మారుతి రియాక్ట్ అయ్యారు.

8 నిమిషాల సీన్స్ యాడ్

కొన్ని సాంకేతిక కారణాలతో ఆ సీన్స్ సినిమాలో యాడ్ చేయలేదని డైరెక్టర్ మారుతి తెలిపారు. డార్లింగ్ ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరిచేలా అవి తాజాగా యాడ్ చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా 8 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తున్నామని... ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూసిన ఓల్డ్ గెటప్ అందులో ఉంటుందని వెల్లడించారు. ఈ మీట్‌లో హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.

Also Read : యష్‌తో రొమాంటిక్ సీన్ - 'టాక్సిక్' బోల్డ్ బ్యూటీ నటాలియా కాదు... ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

'ఒక్క షోతోనే తెలీదు'

మూవీ రిజల్ట్ ఒక్క షో, ఒక్క రోజులోనే నిర్ణయించకూడదని... పది రోజులు ఆగితే 'ది రాజా సాబ్' అంటే ఏంటో తెలుస్తుందని మారుతి అన్నారు. 'మూవీలో కొత్త పాయింట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అర్థమైన వారు బాగుందంటున్నారు. అర్థం కాని వారు తిడుతున్నారు. దయచేసి అప్పుడే ఫలితం నిర్ణయించొద్దు. టీజర్, పోస్టర్స్‌లో ఓల్డ్ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను చూపించాం. అయితే, సినిమాలో ఆ లుక్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేదు.

ఈ రోజు సాయంత్రం నుంచీ ఆ సీన్స్ మూవీలో యాడ్ చేస్తున్నాం. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ కట్ చేసి 8 నిమిషాల ఈ సీన్స్ యాడ్ చేస్తున్నాం. సెన్సార్ కూడా పూర్తైంది. ఆ సీన్స్ కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారు. ఆయన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకున్నారో అలానే చూపించాను.' అని అన్నారు.

సోమవారం నుంచి నార్మల్ రేట్స్

కామన్ ఆడియన్స్ చాలా మందికి 'ది రాజా సాబ్' రీచ్ అయ్యిందని మారుతి తెలిపారు. 'ప్రభాస్‌ను కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్‌గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. సినిమా లాస్ట్ 40 మినిట్స్ అందరికీ నచ్చింది. కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ప్రభాస్ ప్రయత్నించారు. ఓ మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా ఆయన చేశారు. సినిమా రిజల్ట్ గురించి బాధ పడుతున్నానని చాలా మంది ఫోన్ చేశారు.

కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నా. కొత్త పాయింట్ చెప్పినప్పుడు ఆడియన్స్ స్వీకరించడానికి కాస్త టైం పడుతుంది. మీరు కూడా సంతోషంగా ఉండండి. ఈ సంక్రాంతికి అన్నీ సినిమాలు చాలా హిట్ కావాలని కోరుకుంటున్నా. నాకు ధైర్యం చెప్పిన ప్రతీ ఫ్రెండ్‌కు థాంక్స్. సోమవారం నుంచి నార్మల్ టికెట్ రేట్స్ అందుబాటులో ఉంటాయి.' అని చెప్పారు. 

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

ఈ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.112 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. తొలి రోజు 100 కోట్ల కలెక్షన్స్ దాటుతాయని ముందే అనుకున్నామని... చాలామంది కుటుంబ సమేతంగా మూవీని ఎంజాయ్ చేస్తున్నట్లు విశ్వప్రసాద్ చెప్పారు. కొంతమంది కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ సంక్రాంతి బరిలో నిలిచి సినిమా హిట్ కొట్టిందని అన్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget