I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Dulquer Salmaan New Movie : దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఐయామ్ గేమ్. ఆగస్ట్ 20న రిలీజ్ కావాల్సిన మూవీ అనుకోని కారణాలతో వాయిదా పడింది.

Dulquer Salmaan's I'm Game New Release Date : స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఐయామ్ గేమ్ (Im Game). దుల్కర్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ మూవీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఆగస్ట్ 20న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినా తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 3న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఒకేసారి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ముందుగా అనుకున్న డేట్‌కు అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో అన్నీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని వాయిదా వేసినట్లు ప్రకటించారు.
ఈ మూవీకి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తుండగా... దుల్కర్ సల్మాన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే ఆంటోని వర్గీస్, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, కతిర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ మూవీని నిర్మిస్తున్నారు.
View this post on Instagram
ఎన్టీఆర్ మెచ్చిన ట్రైలర్
ఈ మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్‌గా స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది. క్యాసినో, గ్యాంబ్లింగ్ గేమ్స్, బ్లాక్ మనీ దందాను హీరో ఎలా శాసించాడు? అనేది ట్రైలర్ చూపించారు. దుల్కర్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ ట్రైలర్‌ను ఎన్టీఆర్ ప్రశంసించారు. మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ట్రెండింగ్ వార్తలు






















