ప్రభాస్ స్పీచ్ హైలైట్స్... రాజా సాబ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏం చెప్పారంటే?

Published by: Satya Pulagam

'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్‌లో ఫస్ట్ హైలైట్ ప్రభాస్ లుక్. ఆయన పోనీ టైల్ (పిలక) ఫ్యాన్స్, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 'స్పిరిట్' కోసం ఆయన పోనీ టైల్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. ఆ షూట్ నుంచి వేడుకకు వచ్చారు.

పెళ్లి గురించి ప్రభాస్ స్పందించారు. అమ్మాయిలో ఎటువంటి లక్షణాలు ఉండాలని అడగ్గా... 'అది తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు' అని సరదాగా సమాధానం ఇచ్చారు రెబల్ స్టార్. 

దర్శకుడు మారుతి 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేదికపై భావోద్వేగానికి లోను అయ్యారు. ఆయన కన్నీళ్లు పెట్టుకోగా... కింద ఉన్న ప్రభాస్ వెంటనే వేదిక మీదకు వెళ్లి మారుతిని ఓదార్చారు.

సంక్రాంతికి తెలుగులో భారీ పోటీ నెలకొంది. చిరు, రవితేజ వంటి స్టార్లతో పాటు యంగ్ హీరోలు కూడా వస్తున్నారు. సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవడంతో పాటు సీనియర్లు సీనియర్లేనని, వాళ్ళ నుంచి నేర్చుకున్నామని పెద్దలకు గౌరవం ఇచ్చారు ప్రభాస్. 

'ది రాజా సాబ్' క్లైమాక్స్ చూశాక మారుతికి ఫ్యాన్ అయ్యానని చెప్పారు ప్రభాస్. ఆ తర్వాత 'డార్లింగ్... ఆ క్లైమాక్స్ పెన్నుతో రాశావా? మెషీన్ గన్నతో రాశావా?' అని మారుతిని అడిగారు. 

'ది రాజా సాబ్'కు హీరో విశ్వప్రసాద్ గారు అని, మూడేళ్ళ క్రితం ఒక బడ్జెట్ అనుకోగా... అది పెరిగినా ఆయన వెనుకడుగు వేయలేదని, ఆయన ధైర్యం గురించి గొప్పగా చెప్పారు.

ఇండియాలో తమన్ లాంటి ఆర్ఆర్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ మరొకరు లేరని ప్రభాస్ చెప్పారు. సినిమాను ఆయన చేతుల్లో పెట్టామని చెప్పారు.

హీరోయిన్లలో రిద్ధి కుమార్ బ్యూటిఫుల్ అని, మాళవికా మోహనన్ కళ్ళు బావుంటాయని, సెట్ లో అందరి ఫెవరేట్ నిధి అగర్వాల్ అని చెప్పారు.

పదిహేనేళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ సినిమా చేశానని, అభిమానులు చూసుకోవాలని ప్రభాస్ అన్నారు. జనవరి 9న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'ది రాజా సాబ్' రిలీజ్ అవుతోంది.