Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
టీమ్ ఇండియా స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య ( Hardik Pandya ) విజయ్ హజారే ట్రోఫీలో ( Vijay Hazare Trophy ) పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. బరోడా తరపున ఆడుతున్న హార్దిక్ పాండ్య, చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 31 బంతుల్లోనే 75 పరుగులు చేసాడు హార్దిక్ పాండ్య.
ఈ మ్యాచ్ లో ముందు టాస్ గెలిచిన బరోడా టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ 11 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొద్దీ సేపటి తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్య బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
హార్దిక్ పాండ్యా ఆడిన ఈ సూపర్ ఇన్నింగ్స్‌లో 75 పరుగుల్లో 62 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. అలాగే బౌలింగ్‌లోనూ 10 ఓవర్లు వేసి 3 వికెట్లను పడగొట్టాడు అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు హార్దిక్ పాండ్యా ఫామ్‌లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం.





















