Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
Parag Tyagi On Shefali Death: పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాల్లో ఛోటా విలన్ రోల్స్ చేసిన ఉత్తరాది నటుడు పరాగ్ త్యాగి. భార్య మరణంపై సంచనల వ్యాఖ్యలు చేశారు.

హిందీ సాంగ్ 'కాంటా లాగా'తో పాపులర్ అయిన అందాల భామ షెఫాలీ జరీవాలా. ఆమె ఇక లేరు. గతేడాది జూన్ 27న మరణించారు. ఆమె మరణ వార్త విని ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. షెఫాలీ మరణం తర్వాత చిన్న వయసులో ఎలా మృతి చెందిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైద్యుల నివేదికలో ఆవిడ గుండెపోటుతో మరణించిందని వెల్లడి అయ్యింది. కానీ ఇప్పుడు ఆమె భర్త పరాగ్ త్యాగి తన భార్య మరణానికి గల కారణం గుండెపోటు కాదంటున్నారు.
తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట', విక్టరీ వెంకటేష్ - యువసామ్రాట్ నాగ చైతన్య 'వెంకీ మామ' సినిమాల్లో ఛోటా విలన్ రోల్స్ చేశారు పరాగ్ త్యాగి. ఇటీవల పారస్ చాబ్రా పోడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షెఫాలీ జరీవాలాపై బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) చేశారని ఆయన వెల్లడించారు. పోడ్‌కాస్ట్‌లో పరాగ్ మాట్లాడుతూ... ''షెఫాలీపై ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారని భావిస్తున్నాను. ప్రజలు ఈ విషయాలను నమ్మరు. కానీ, నేను పూర్తిగా నమ్ముతాను'' అని కూడా ఆయన అన్నారు.
View this post on Instagram
ఇంకా పరాగ్ త్యాగి మాట్లాడుతూ... ''దేవుడు ఎక్కడ ఉంటాడో, అక్కడ దెయ్యం కూడా ఉంటుంది. నేడు ప్రజలు తమ బాధల కంటే ఇతరుల ఆనందానికి ఎక్కువ బాధ పడుతున్నారు. ఎవరు (చేతబరి) చేశారో నాకు తెలుసు. కానీ, నేను చెప్పలేను. ఏదో తప్పుగా ఉందని, జరిగిందని నేను భావిస్తున్నాను. ఒకసారి కాదు, రెండుసార్లు చేతబడి జరిగింది. ఒకసారి బయటపడ్డాము. కానీ, రెండో సారి అది కొంచెం భారీగా చేశారు. ఏమి జరిగిందో నాకు తెలియదు'' అని అన్నారు.
Also Read: Tamannaah Bhatia: యూట్యూబ్‌లో తమన్నా ఐటమ్ నంబర్ రికార్డులు... దుమ్ము రేపిన 'ఆజ్ కీ రాత్'
పరాగ్ త్యాగి సమాధానం చూస్తుంటే... తన భార్య షెఫాలీ జరీవాలా ఇంకా జీవించాల్సిన వయస్సు కంటే ముందే వెళ్లిపోయిందని ఆయన నిజంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. షెఫాలీ జూన్ 27, 2025న మరణించారు. షెఫాలీ మరణం తర్వాత, పరాగ్ ఎల్లప్పుడూ ఆమెను గుర్తు చేసుకుంటారు. అతను తన ఛాతీపై షెఫాలీ ఫేస్‌ను పెద్ద టాటూగా కూడా వేయించుకున్నాడు.
Also Read: టబుతో రిలేషన్షిప్... ఆమెతో వన్ నైట్ స్టాండ్... హీరోయిన్‌ను వదిలేసి ఆవిడతో పెళ్లి?






















