Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ కెప్టెన్సీపై మరోసారి చర్చ మొదలయ్యింది. టెస్ట్, టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. "చీఫ్ సెలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కోచ్ ప్రమేయం లేకుండా ఇలాంటి పెద్ద నిర్ణయాలు జరగవు. ఒకరి భుజంపై తుపాకీ పెట్టి మరొకరు కాల్చినట్లుగా ఈ వ్యవహారం కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ను మార్చడం వెనుక క్రికెట్ లాజిక్ ఏముందో నాకు అర్థం కావడం లేదు" అని మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా సెలెక్షన్ కమిటీ నియమించింది. కానీ రోహిత్ ఫిట్‌నెస్, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే మరో ప్రపంచకప్ తీసుకోని వస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.





















