Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
పట్టాలపై పరిగెత్తే విమానం ఇది. అతిశయోక్తి ఏం కాదు. ఓ విమాననంలో ఉండే ఫెసిలిటీస్ ని రైల్లోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే. నార్మల్ వందేభారత్ తరహాలోనే వేగానికి వేగం...ఇప్పుడు స్లీపర్ ఫెసిలిటీ ఓ యాడెడ్ అడ్వాంటేజ్ దీనికి. మాములు రైళ్లలో ఏసీ కంపార్ట్మెంట్స్ లో ఉండే ఫెసిలిటీస్ ను మరింత ఎన్స్ హాన్స్ చేస్తూ మొత్తం రైలు అంతా స్లీపర్ ఉండేలా వందేభారత్ స్లీపర్ ను డిజైన్ చేశారు. ప్రధాని మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ లోని హౌడా స్టేషన్ నుంచి అస్సాం లోని గుహవాటికి తొలి సర్వీస్ ను ప్రారంభించారు. కామాఖ్య అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకించి ఈ స్లీపర్ రైలు ఏర్పాటు అయ్యింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లటం ఈ రైలు స్పెషాలిటీ. గ్లాసు మీద గ్లాసు గ్లాసు మీద గ్లాసు పెట్టి వాటిని మొత్తం నీటితో నింపినా..తొణక్కుండా బెణక్కుండా నీటి చుక్క కిందకు జాలు వారకుండా అత్యంత మృదువుగా ఉంటూనే 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లటం ఈ రైలు ప్రత్యేకత. 16కోచ్ లతో ఉండే ఈ రైల్లో...అన్నీ ఏసీ బోగీలే కానీ దాంట్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. 11 ఏసీ బోగీలు టైర్ 3, నాలుగు టైర్ 2 ఏసీ బోగీలు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. 823 మంది ప్రయాణికులు ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతం నడుస్తున్న సర్వీస్ కి 960 రూపాయల నుంచి 2299 రూపాయల వరకూ టికెట్ ప్రైస్ లు ఉన్నాయి. మనం బుక్ చేసుకునే బోగీల ఆధారంగా. హైఎండ్ క్వాలిటీ స్లీపర్ బెర్తులు, హైఎండ్ సస్పెన్షన్ సిస్టమ్, స్మోక్ డిటెక్టింగ్ సిస్టమ్స్, రియల్ టైమ్ సీసీ టీవీ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ లాంటివి ఈ ట్రైన్ కి ఉండవు. ముందుగా బుక్ చేసుకోవాల్సిందే.





















