అన్వేషించండి

Bengal Assembly Elections 2026: బెంగాల్ కోటపై కాషాయ దండయాత్ర - మరోసారి దీదీ విజయాన్ని అందుకోవడం కష్టమేనా?

Bengal: బెంగాల్ లో ఈ సారి ఎలాగైనా గెలవాలని బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. మమతా బెనర్జీ విజయాల పరంపరకు చెక్ పెట్టాలని అనుకుంటోంది.

BJP is making another foray in the Bengal Assembly elections:  పశ్చిమ బెంగాల్ రాజకీయ రణరంగం మరోసారి హీటెక్కుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు దూసుకొస్తున్న భారతీయ జనతా పార్టీ మధ్య చావో రేవో తేల్చుకునే పోరు మొదలైంది. 

కమలం దూకుడు.. కకావికలమైన లెఫ్ట్, కాంగ్రెస్!

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ముక్కోణపు పోటీ పోయి, ఇప్పుడు నేరుగా టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి బెంగాల్‌లో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఈసారి రాష్ట్రమంతటా భారీగా కేడర్‌ను మోహరించింది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్ మరియు గిరిజన ప్రాంతాల్లో బీజేపీ పట్టు పెంచుకుంటూ వస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు బెంగాల్‌ను ఒక ప్రతిష్టాత్మక యుద్ధంగా భావించి ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హిందూ ఓట్ల  పోలరైజేషన్  తమకు కలిసొస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది.

అధికార వ్యతిరేకత మమతా బెనర్జీకి సవాల్      

మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  బెంగాల్ కుమార్తెను అనే సెంటిమెంట్‌తో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లఖ్మీర్ భండార్  వంటి సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను కట్టిపడేశాయి. అయితే, సందేశ్‌ఖాలీ వంటి ఘటనలు, టీఎంసీ స్థానిక నాయకులపై వస్తున్న అవినీతి ఆరోపణలు మమతా ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారాయి. ముస్లిం ఓటు బ్యాంకు చెల్లాచెదురు కాకుండా చూసుకోవడం మమతకు ఇప్పుడు కీలకం. ఈసారి ఎన్నికల్లో దీదీ తన వ్యక్తిగత చరిష్మాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

మనుగడ కోసం లెఫ్ట్, కాంగ్రెస్ పోరాటం 

ఒకప్పుడు బెంగాల్‌ను దశాబ్దాల పాటు ఏలిన కమ్యూనిస్టులు,  కాంగ్రెస్ పార్టీల పరిస్థితి దయనీయంగా మారింది.  ఈ రెండు పార్టీలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంకు ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ వైపు మళ్లిపోయింది. యువతను ఆకట్టుకోవడానికి కమ్యూనిస్టులు కొత్త ముఖాలను రంగంలోకి దించుతున్నా, అది ఎన్నికల ఫలితాల్లో సీట్లుగా మారడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం మాల్దా, ముర్షిదాబాద్ వంటి కొన్ని పాకెట్లకే పరిమితం కానుంది. 

బీజేపీకి మెరుగుపడిన అవకాశాలు

బీజేపీకి ఈసారి అధికారంలోకి రావడానికి గతంలో కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్థానిక సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోవడంలో కాషాయ దళం సక్సెస్ అయితే బెంగాల్ చరిత్ర మారుతుంది. అయితే, మమతా బెనర్జీని తక్కువ అంచనా వేయలేం. ఎన్నికల సమయంలో ఆమె చేసే పోరాట పటిమ, వీధి పోరాటాలు చివరి నిమిషంలో ఫలితాలను తారుమారు చేయగలవు. బెంగాల్ పీఠం ఎవరిదనేది ఈసారి అతి తక్కువ ఓట్ల శాతంతో తేలేలా ఉంది. బీజేపీ  దండయాత్ర  ఫలించి కోటను స్వాధీనం చేసుకుంటుందా.. లేక మమత తన  బెంగాల్ టైగర్  ఇమేజ్‌తో హ్యాట్రిక్ కొడుతుందా అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. 


 

టాప్ హెడ్ లైన్స్

West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
ABP Desam Top 10, 9 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 9 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget