అన్వేషించండి

Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక

ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీకి సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ, వైస్ కెప్టెన్ గా రికీ భుయ్ ఎంపికయ్యారు.

Duleep Trophy, Tilak Varma Leads South Zone: ఇండియా టి20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు సౌత్ జోన్ కెప్టెన్సీ లభించింది. బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగబోయే దులీప్ ట్రోఫీకి 15 మందితో కూడిన సౌత్ జోన్ టీమ్ ను అనౌన్స్ చేశారు. ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, ఆంధ్ర సీనియర్ కోచ్ ఎమ్‌ఎన్ విక్రమ్ వర్మ హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. రీసెంట్ గా జింబాబ్వేపై 3-0 తో సిరీస్ గెలిచిన ఇండియన్ టి20 టీమ్ లో తిలక్ వర్మ కీ రోల్ ప్లే చేశాడు.

సెలెక్షన్ కమిటీ మీటింగ్.. సౌత్ ఇండియా స్టేట్స్ ప్రతినిధులు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) సెక్రటరీ సనా సతీష్ బాబు లీడ్ లో ఈ సెలెక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. మాజీ రంజీ ప్లేయర్ ఆర్‌వి చంద్రమౌళి ప్రసాద్ సెలెక్షన్ ప్యానెల్ ఛైర్మన్ గా వ్యవహరించగా తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, గోవా, పాండిచ్చేరి, కేరళ స్టేట్స్ ప్రతినిధులు మీటింగ్ లో పాల్గొన్నారు. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ తో పాటు 2025/26 రంజీ సీజన్ లో 950 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచిన ఆర్ స్మరన్, హైదరాబాద్ కి చెందిన కె హిమతేజ టీమ్ లో చోటు దక్కించుకున్నారు.

వికెట్ కీపర్ గా ఎన్ జగదీశన్.. డైరెక్ట్ సెమీస్ కి సౌత్ జోన్
ఇండియా 'ఎ' తరఫున లంక పర్యటనలో రాణించిన షేక్ రషీద్, జగదీశన్ లు స్క్వాడ్ లో ఉన్నారు. ఎన్ జగదీశన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చూడనున్నాడు. లాస్ట్ ఎడిషన్ లో రన్నరప్ గా నిలిచిన సౌత్ జోన్ ఈసారి డైరెక్ట్ గా సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆగస్టు 30న క్వార్టర్ ఫైనల్ 2 విన్నర్ తో సెమీస్ లో తలపడనుంది.

స్పిన్, పేస్ బౌలింగ్ అటాక్ వివరాలు
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనుండగా, కే సాయి తేజ, త్రిపురాణ విజయ్, విద్వత్ కావేరప్ప, ఎమ్‌డి నిదీష్ లు పేస్ అటాక్ బాధ్యతలు పంచుకోనున్నారు.

సౌత్ జోన్ కంప్లీట్ స్క్వాడ్
తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్ (వైస్ కెప్టెన్), అభినవ్ తేజరానా, షేక్ రషీద్, కెఎమ్‌ హిమతేజ, ఆర్ స్మరన్, ఎన్ జగదీశన్, కరుణ్ నాయర్, తనయ్ త్యాగరాజన్, శ్రేయస్ గోపాల్, కే సాయి తేజ, టి విజయ్, విద్వత్ కావేరప్ప, హెచ్ అమన్ ఖాన్, ఎమ్‌డి నిదీష్ ఉన్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
IND VS WI 2nd T20 Updates: స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget