Vishnu Vinyasam First Review : విష్ణు విన్యాసం ఫస్ట్ రివ్యూ - శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందంటే?
Vishnu Vinyasam Review : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'. మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. ఫ్యామిలీతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తారని శ్రీవిష్ణు తెలిపారు.

Sree Vishnu Reviews On Vishnu Vinyasam : టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'. శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. హీరో శ్రీవిష్ణునే స్వయంగా ఈ మూవీ ఎలా ఉంటుందో చెప్పారు.
మూవీ ఎలా ఉంటుందంటే?
'విష్ణు విన్యాసం' కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలిపారు శ్రీవిష్ణు. ఓ సింపుల్ టౌన్‌లో జరిగే ఓ సాధారణ కథ అని చెప్పారు. 'ఫస్టాఫ్ అంతా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. బెస్ట్ డైలాగ్స్ యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. హిలేరియస్ కామెడీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్‌కు వచ్చే సరికి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది.
మూవీ కంప్లీట్ అయ్యే సరికి ఓ బెస్ట్ మూవీ చూసిన ఫీలింగ్ అటు యూత్ ఆడియన్స్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కలుగుతుంది. హ్యాపీగా ఫ్యామిలీతో రెండు గంటలు నవ్వుకుంటారు.' అంటూ వివరించారు. దీంతో హైప్ క్రియేట్ అవుతోంది.
View this post on Instagram
Also Read : నాని 'ఆయా షేర్' ట్రెండింగ్ - కడుపు మండిన జమానాలో కత్తి లాంటి లిరిక్స్
ఈ మూవీకి కొత్త డైరెక్టర్ యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించగా... శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సత్య, మురళీ శర్మ, ప్రవీణ్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, ప్రవీణ్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాధన్ మ్యూజిక్ అందించగా... హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు.
























