అన్వేషించండి

Andhra Pradesh Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్‌ ముందు లొంగిపోయిన అవినాష్ రెడ్డి!సుప్రీంకోర్టు మొట్టి కాయలతో దారిలోకి... 

Andhra Pradesh Liquor Scam Case: ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించడంతో లిక్కర్ స్కామ్‌లో అవినాశ్ రెడ్డి లొంగిపోయారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Andhra Pradesh Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది కాలంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న ఏడో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, ఎట్టకేలకు మంగళవారం విజయవాడలోని సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక లొంగిపోవడం తప్ప మరో మార్గం లేక ఆయన తన న్యాయవాదితో కలిసి అధికారుల ముందుకు వచ్చారు. 

ఏడాది కాలంగా విదేశాల్లోనే... 

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసు నమోదైనప్పటికీ నుంచి ముప్పిడి అవినాష్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆయన సోదరుడు అరెస్ట్‌అయిన తర్వాత తనను కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. గతేడాది నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై అధికారులు లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ కూడా జారీ చేశారు. 

తొలుత బెయిల్‌ కోసం అవినాష్‌   రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జనవరి 29న హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. 

సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు 

ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యాకాంత్‌, జస్టిస్ జోయ్‌ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది.  అవినాష్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆయన ఫిబ్రవరి 26న శ్రీలంక నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని, అప్పటి వరకు అరెస్టు చేయకుండా లుక్ అవుట్ సర్క్యూలర్‌ను నిలిపివేయాలని కోరారు. అయితే దీనిపై సీజేఐ సూర్యాకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా నిందితుడు పరారీలోనే ఉన్నాడు కదా? అసలు ఏ కోర్టు అనుమతి తీసుకొని ఆయన విదేశాలకు వెళ్లారు? అని సూటిగా ప్రశ్నించింది. 

చట్టాన్ని ఏమార్చేందుకు ప్రయత్నించే వ్యక్తులకు ముందస్తు బెయిల్ ఇచ్చి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది ముందు ఆయన లొంగిపోవాలి, ఆ తర్వాతే రెగ్యులర్‌బెయిల్‌ లేదా మధ్యంతర బెయిల్ పిటిషన్లు పరిశీలిస్తామని చెప్పారు. దీంతో అవినాష్‌ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. 

విజయవాడ సిట్ కార్యాలయంలో లొంగుబాటు 

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక తప్పించుకునే అవకాశం లేదని గ్రహించిన ముప్పిడి అవినాష్ మంగళవారం సాయంత్రమే విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాదితో కలిసి వచ్చి అధికారుల ఎదుట సరెండ్ అయ్యారు. ఏడాది కాలంగా సాగుతున్న ఈ దాగుడుమూతల పర్వానికి ఇక్కడితో తెరపడింది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో అవినాష్ రెడ్డి లొంగుబాటుతో ఈ దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.           
  

Frequently Asked Questions

మద్యం కుంభకోణం కేసులో ఏడో నిందితుడు ఎవరు?

మద్యం కుంభకోణం కేసులో ఏడో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి. అతను పోలీసులకు దొరకకుండా ఏడాది కాలంగా తప్పించుకుంటున్నాడు.

ముప్పిడి అవినాష్ రెడ్డి ఎందుకు లొంగిపోయారు?

సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇక లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేక అధికారుల ముందు లొంగిపోయారు.

ముప్పిడి అవినాష్ రెడ్డి ఎంతకాలం పరారీలో ఉన్నారు?

ముప్పిడి అవినాష్ రెడ్డి కేసు నమోదైనప్పటి నుండి ఏడాది కాలంగా పరారీలో ఉన్నారు. అతను దేశం విడిచి విదేశాలకు పారిపోయారు.

ముప్పిడి అవినాష్ రెడ్డి బెయిల్ కోసం ఎక్కడ ప్రయత్నించారు?

ముప్పిడి అవినాష్ రెడ్డి మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు, కానీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Karumuri Nageswara Rao: కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget