అన్వేషించండి

Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!

Andhra Pradesh and Telangana Weather Update: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మూడు రోజుల నుంచి వాతావరణం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.

Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలకు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎప్పుడో వేసవి కాలంలో రావాల్సిన వర్షాలు వేసవి మొదట్లోనే పడుతున్నాయని అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు అధికారులు. 

తెలంగాణలో మూడు రోజుల నుంచి వాతావరణం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వాతావరణ పరిస్థితిని ముందే గ్రహించిన అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వివరించారు. శుక్రవారం నుంచి వాతావరణం నార్మల్‌గా ఉంటుందని ఉక్కపోత మొదలవుతుందని వెల్లడించారు. 

నాలుగు జిల్లాలకు వర్షాల హెచ్చరిక ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత మాత్రం తగ్గదని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదు అవుతున్నాయని తెలిపారు. బుధవారం కూడా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడ్డాయి. 

హైదరాబాద్‌లో వాతావరణం

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం లేదా రాత్రివేళల్లో పొగమంచు పరిస్థితులు ఏర్పడతాయి. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు ఉంటే, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు ఉంటుంది. ఉపరితల గాలులు దక్షిణ ఆగ్నేయ దిశలో గంటలు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలుగా నమోదు అయితే కనిష్ట ఉష్ణోగ్రత 20.9గా రికార్డు అయ్యింది. ‌ 

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.   

ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నప్పటికీ మరో రెండు మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. దాదాపుగా మార్చి 1 నుంచి ఎండలు మండిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీహైడ్రేట్‌ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.   

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget