అన్వేషించండి

Hyderabad Fire Accident: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరీ షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం ! భారీగా ఎగసిపడ్డ మంటలు!

Hyderabad Fire Accident: హైదరాాబాద్‌లోని మంగళగౌరీ షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు ప్రాథమికంగా తేలింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్‌ నంబర్‌ 36లోని మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న ప్రముఖ వస్త్ర దుకాణం మంగళగౌరి సిల్స్క్‌ షాపింగ్‌మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

ఒక్కసారిగా చుట్టుముట్టి మంటలు  

షాపింగ్ మాల్‌ లోపలి భాగంలో ప్రారంభమైన మంటలు అత్యంత వేగంగా భవనం మొత్తానికి విస్తరించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, మంటలు మొదట లోపల అంటుకొని ఆ తర్వాత భవనం వెలుపల ఉన్న డెకరేషన్ సెట్టింగ్‌లతోపాటు మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. వస్త్ర దుకాణం కావడంతో లోపల ఉన్న భారీ వస్త్ర నిల్వలు మంటలు త్వరగా వ్యాప్తించడానికి కారణమైనట్టు తెలుస్తోంది. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో మెట్రోస్టేషన్‌ మీదుగా వెళ్లే ప్రయాణికులు, వాహనాదారులు తీవ్ర ఉబ్బందులకు గురయ్యారు.

రంగంలోకి దిగిన అగ్ని మాపక దళం

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదం మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు, మంటలు పక్కనే ఉన్న ఇతర వాణిజ్య భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం వెలుపలి నుంచి, లోపలి నుంచి నీటిని చిమ్మి మంటలు తీవ్రత తగ్గించారు. 

సహాయక చర్యలు, సిబ్బంది రక్షణ

ప్రమాదం జరిగిన సమయంలో షాపింగ్‌లో మాల్‌లో సిబ్బంది, వినియోగదారులు ఉన్నట్టు సమాచారం. భవనంలో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలు అతికష్టమ్మీద లోపలికి వెళ్లి వారిని రక్షించారు. 

కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది!

ఈ భారీ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇంకా ఏదైనా కారణం ఉందో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అంతే కాకుండా ప్రమాదం జరిగిన భవనంలో అగ్ని మాపక రక్షణ వ్యవస్థలు సరిగా ఉన్నాయో లేవో కూడా తనిఖీ చేయనున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను అధికారులు క్రమబద్ధీకరించారు.  

Frequently Asked Questions

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగింది?

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న మంగళగౌరి సిల్స్క్‌ షాపింగ్‌మాల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.

మంటలు ఎలా వ్యాప్తించాయి?

షాపింగ్ మాల్‌ లోపలి భాగంలో ప్రారంభమైన మంటలు వస్త్ర నిల్వల కారణంగా అత్యంత వేగంగా భవనం మొత్తానికి విస్తరించాయి.

అగ్ని ప్రమాదం వల్ల ఎవరైనా గాయపడ్డారా?

ప్రమాదం జరిగిన సమయంలో షాపింగ్‌లో ఉన్న సిబ్బంది, వినియోగదారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమై ఉండవచ్చు?

అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్‌ లేదా ఇతర కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Telangana Weather:: తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget