NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
NTR GHAT | నేడు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్, సినీ నటుడు కళ్యాణ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద రామ్ తాత గారికి నివాళులర్పించారు.

NTR Death Anniversary | హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు అభిమానులు, నేతలు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు ఉంచి ఘనంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
Nandamuri #KalyanRam visited #NTRGhat and paid tribute to the legendary #NTR Garu @NANDAMURIKALYAN #JoharNTR pic.twitter.com/tlxvtmTpgw
— Suresh PRO (@SureshPRO_) January 18, 2026
నందమూరి కుటుంబానికి చెందిన టాలీవుడ్ నటుడు కల్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి తన తాత ఎన్టీఆర్ గారికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవల్ని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘాట్ పరిసరాలను రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను గుర్తుచేసుకునేలా అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. మీరు భౌతికంగా… pic.twitter.com/ZdaeHMvZkF
— Lokesh Nara (@naralokesh) January 18, 2026
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఉదయం పార్టీ కార్యాలయానికి రానున్నారు. సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్ కు బయలుదేరనున్నారు.























