Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
నేడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ( NTR Death Anniversary ). ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) సందర్శించారు. తాత సమాధిపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
లోకేశ్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. "తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజించడం ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిన వరం. మీరు భౌతికంగా దూరమైనా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్నారు," అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు అభిమానులు, నేతలు భారీగా తరలివస్తున్నారు. హీరో కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, ఎంపీ పురందేశ్వరి, లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు.




















