Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
హైదరాబాద్ నుంచి గన్నవరం వైపు వెళ్లే వాహనదారులకు కోసం కొత్త బైపాస్ రోడ్ పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. పచ్చని పొలాలు- కొండల మధ్య నుంచి ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణం సాగించేలా గొల్లపూడి -గన్నవరం బై పాస్ రెడీ అయిపోయింది. హైదరాబాద్ నుండి సంక్రాంతి పండగకోసం వచ్చేవాళ్లకు బెస్ట్ రూట్ ఇది. ఫుల్ డీటైల్స్ ఈ వీడియోలో చూసేయండి.విజయవాడ ఫై ట్రాఫిక్ భారం తగ్గించడానికి చెన్నై, బెంగళూరు వైవు నుండి గోదావరి జిల్లాలకు వచ్చే వాహనాలకోసం కాజా టోల్ గేట్ నుండి గొల్లపూడి వరకూ ఉన్న అమరావతి బైపాస్ (విజయవాడ వెస్ట్ ) తెరుస్తామని ప్రచారం చేశారు. కానీ దేశవ్యాప్తం గా ఉన్న "తారు " సరఫరా సమస్య వలన ఈ రోడ్డు ను చెన్నై -విజయవాడ హైవే కు లింక్ చేయడం లేట్ అవుతోంది. దీనివలన బైపాస్ ను హైవే తో లింక్ చేయడం మరికొన్ని రోజులు పట్టేలా ఉండడం తో చెన్నై సైడ్ నుండి గోదావరి జిల్లాలు వెళ్లే ప్రయాణికులు రెగ్యులర్ రూట్ లోనే వెళ్లాల్సి వస్తోంది. జనవరి 15 వ తేదీ తరువాతే ఈ బైపాస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రోడ్డువేస్తున్న సిబ్బంది తెలిపారు.





















