అన్వేషించండి

Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 

Iran War Effect On Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్టింగ్ షాప్‌ అత్యంత కీలకమైన విభాగం, ఇక్కడ తయారైన స్టీల్ బ్లూమ్స్‌ అవసరమైన పరిమాణంలో కట్ చేయడానికి ఎల్పీజీని వినియోగిస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమాసియా యుద్ధం విశాఖ ఉక్కు ప్లాంట్‌పై ప్రభావం చూపుతోంది.
  • ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఉంది.
  • ప్రస్తుతం పది రోజులకు సరిపడా గ్యాస్ మాత్రమే నిల్వ ఉంది.
  • ఎంపీ భరత్ అధికారులతో చర్చించి, సరఫరా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు.

Iran War Effect On Vizag Steel Plant: ఎక్కడో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో మార్పులు రావడం, మన దేశీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమను ఇబ్బందుల్లో పడేస్తోంది. ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమను నడపడానికి అత్యంత కీలకమైన ఎల్పీజీ సరఫరా నిలిచిపోయే పరిస్థితి రావడంతో, మోర పది రోజుల్లో ఉత్పత్తి మొత్తం ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ సంక్షోభంపై స్టీల్ అధికారులు, కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. 

స్టీల్ ప్లాంట్‌కు గ్యాస్ ఎందుకు అవసరం?

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్టింగ్ షాప్‌ అత్యంత కీలకమైన విభాగం, ఇక్కడ తయారైన స్టీల్ బ్లూమ్స్‌ అవసరమైన పరిమాణంలో కట్ చేయడానికి ఎల్పీజీని వినియోగిస్తారు. ప్రతి రోజూ సుమారు నాలుగు వేల బ్లూమ్స్ కట్ చేయాల్సి ఉంటుంది.  ఈ బ్లూమ్స్‌ కట్ చేస్తే బెడ్ ఖాళీ అవుతుంది. తద్వారా నిరంతరం కాస్టింగ్ ప్రక్రియ ఇబ్బంది లేకుండా సాగుతుంది. ఈ కటింగ్‌ ప్రక్రియలో ఎల్పీజీకి వేరే ప్రత్యామ్నాయం ఏదీ అందుబాటులో లేదు. ఒక వేళ గ్యాస్ సరఫరా ఆగిపోతే కటింగ్ ఆపవలసి ఉంటుంది. దీంతో ప్లాంట్ మొత్తంలో ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంది. 

దీని వల్ల ప్లాంట్‌ ప్రతి రోజూ ఉత్పత్తి చేసే పది వేల టన్నుల ఫినిష్డ్‌ స్టీల్ ఆగిపోతుంది. ఇది సంస్థకు భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుంది. ప్లాంట్‌లో పనులు కోసం రోజుకు సుమారు 13 టన్నుల ఎల్పీజీ అవసరం. ప్లాంట్‌లో మొత్తం 325 టన్నుల ఎల్పీజీని దాచుకునే సౌకర్యం ఉంది. ప్రస్తుతం ప్లాంట్‌లో నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం 156 టన్నుల గ్యాస్ మాత్రమే ఉంది. ఉన్న నిల్వలు ప్రస్తుత వినియోగం ప్రకారం మరో పది రోజులకు సరిపోతాయి. పది రోజుల తర్వాత గ్యాస్ రాకపోతే ప్లాంట్ మూతపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇది మొదటిసారి కాదు. 2022లో దేశంలో బొగ్గు సంక్షోభం వచ్చినప్పుడు కూడా నెల రోజుల పాటు ప్లాంట్‌కు బొగ్గు అందలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతోంది. 

రంగంలోకి దిగిన ఎంపీ భరత్

పరిస్థితిని అధికారులు, కార్మిక సంఘాలు విశాఖ ఎంపీ భరత్‌కు వివరించారు. వెంటనే స్పందించిన భరత్ ఢిల్లీలోని కేంద్ర పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. స్టీల్ ప్లాంట్‌కు గ్యాస్ సరఫరా నిలివేస్తే ఉత్పత్తి ఆగిపోతుందని వేల మందిపై ప్రభావం ఉంటుందని తెలియజేశారు. సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తికి అధికారులు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.                                         

Frequently Asked Questions

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఏమిటి?

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాలో మార్పులు వచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన LPG సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల ఉత్పత్తి ఆగిపోయే అవకాశం ఉంది.

స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి LPG ఎందుకు ముఖ్యం?

స్టీల్ మెల్టింగ్ షాప్‌లో స్టీల్ బ్లూమ్స్‌ను కత్తిరించడానికి LPG అవసరం. దీనికి ప్రత్యామ్నాయం లేదు, గ్యాస్ సరఫరా ఆగిపోతే కటింగ్ ఆగిపోయి, మొత్తం ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోతుంది.

LPG సరఫరా నిలిచిపోతే ఎంత నష్టం జరుగుతుంది?

LPG సరఫరా ఆగిపోతే, రోజుకు పది వేల టన్నుల ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి ఆగిపోతుంది, ఇది సంస్థకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.

ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో LPG నిల్వలు ఎంత ఉన్నాయి?

ప్లాంట్‌లో మొత్తం 325 టన్నుల LPG నిల్వ చేసుకునే సదుపాయం ఉండగా, ప్రస్తుతం కేవలం 156 టన్నులు మాత్రమే ఉంది. ఇది సుమారు పది రోజులకు సరిపోతుంది.

ఎంపీ భరత్ ఈ సమస్యపై ఏం చర్యలు తీసుకున్నారు?

విశాఖ ఎంపీ భరత్, ఢిల్లీలోని కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులతో మాట్లాడి, స్టీల్ ప్లాంట్‌కు LPG సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సానుకూలంగా స్పందించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Simhachalam Chandanotsavam 2026: వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజ రూపం ఎలా ఉంటుందో తెలుసా..చందనోత్సవం ఎందుకు చేస్తారు!
వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజ రూపం ఎలా ఉంటుందో తెలుసా..చందనోత్సవం ఎందుకు చేస్తారు!
Simhachalam Chandanotsavam 2026 : సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం! నిజరూప దర్శన సమయం, టికెట్ల వివరాలు ఇవిగో!
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం! నిజరూప దర్శన సమయం, టికెట్ల వివరాలు ఇవిగో!
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Vizag Crime News:సోషల్ మీడియా స్నేహమే ప్రాణం తీసింది! విశాఖ విద్యార్థి శాంతి కుమారి మృతి కేసులో మలుపు!  
సోషల్ మీడియా స్నేహమే ప్రాణం తీసింది! విశాఖ విద్యార్థి శాంతి కుమారి మృతి కేసులో మలుపు!  
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
IPL 2026: CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్
CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్ Viral Video
US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
Love Failure: అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Suzuki Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
Embed widget