Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రెండు ఐసీసీ ట్రోఫీలను భారత్ కు అందించిన కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హిట్‌మ్యాన్‌ను వన్డే క్రికెట్ కెప్టెన్ గా తొలగించి, ఆ బాధ్యతలు గిల్‌కు అప్పగించారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో ఐసీసీ ఛైర్మన్ జై షా, రోహిత్ శర్మను కెప్టెన్‌గా పరిచయం చేసారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
జై షా మాట్లాడుతూ రోహిత్ శర్మను ఇండియా కెప్టెన్ అని అన్నారు. దాంతో టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ ఇచ్చిన రియాక్షన్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.
'మన కెప్టెన్ ఇక్కడే కూర్చొని ఉన్నాడు. టీమ్ఇండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అందుకే నేను రోహిత్‌ను కేవలం కెప్టెన్ అనే పిలుస్తా. 2023 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ వరుసగా పది మ్యాచ్‌ల్లో నెగ్గింది. కానీ, ఆ టోర్నీలో ట్రోఫీ నెగ్గలేకపోయినా, మన టీమ్ అభిమానుల హృదయాలు గెలుచుకుంది ' అని ఆ ఈవెంట్లో జై షా అన్నారు.





















