Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Renu Desai Cyber Crime Complaint: హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీని రేణూ దేశాయ్ కలిశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఎటాక్స్, ట్రోల్స్ మీద కంప్లైంట్ చేశారు.

రేణూ దేశాయ్ (Renu Desai)ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో, నెట్టింట్లో కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల మూగ జీవాలు (వీధి కుక్కలను)ను చంపడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. మనుషులను పట్టించుకోకుండా మూగ జీవాల కోసం రేణూ దేశాయ్ సేవ చేయడాన్ని విమర్శించిన నెటిజనులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ మరొక లైవ్ ఇచ్చారు. నిండుగా దుస్తులు వేసుకున్నా రేటు ఎంత? అని అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులకు ఏం చేస్తున్నావని తనను ప్రశ్నించే వాళ్లు ముందుగా ప్రభుత్వాలను ప్రశ్నించాలని చెప్పారు (రేణూ దేశాయ్ ఇన్‌స్టా లైవ్ అప్డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి). ఇప్పుడు వాళ్లపై ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో దాడి...
ఆ నాలుగు అకౌంట్స్ మీద ఫిర్యాదు!
సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అసభ్యకరమైన దాడుల (Abusive Social Media Attacks)పై రేణూ దేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాలలో కొందరు వ్యక్తులు పరిధి దాటి ప్రవర్తిస్తూ... తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో తాను ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
Also Read: 'దండోరా'కు ఆ కామెంట్స్ మైనస్సా.. వివాదంపై మళ్ళీ నోరు విప్పిన శివాజీ
సోషల్ మీడియా వేదికగా తాను ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టాలని, తనపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేణూ దేశాయ్ పోలీసులను కోరారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా కొందరు పోస్టులు చేస్తున్నారని, అందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించారామె. ముఖ్యంగా నాలుగు అకౌంట్స్ గురించి పేర్కొన్నారు. ఆధారాలను సైతం పోలీసులకు అందించారు. సైబర్ క్రైమ్ డీసీపీని కలిశారు.























