అన్వేషించండి

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!

రైల్వే తీసుకొచ్చిన ఈ డిజిటల్ సంస్కరణలు సామాన్య ప్రయాణికులకు ఒక వరంలాటివి. ఏజెంట్ల బెడద తగ్గడం, సర్వర్లు వేగం పెరగడం, పారదర్శకమైన బుకింగ్ విధాం వల్ల తత్కాల్‌ ప్రయాణం ఇకపై సులభతరంకానుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తత్కాల్ టికెట్ బుకింగ్‌లో ఏజెంట్లకు మొదటి కొన్ని నిమిషాలు నిషేధం.
  • బాట్స్, దొంగ అకౌంట్లపై నిఘా, కఠిన చర్యలు తప్పనిసరి.
  • ఐడీ వెరిఫికేషన్, అప్లికేషన్, వెబ్‌సైట్ వేగం పెంచారు.
  • చెల్లింపు వైఫల్యాలు తగ్గించి, తప్పుడు వివరాలకు జరిమానా విధింపు.

Tatkal Booking New Rules: మనలో చాలా మందికి రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం. కానీ అర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తత్కాల్‌ టికెట్ బుక్ చేయడం అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిదే. కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ముందు కూర్చొని టైమ్‌ పది లేదా 11 అవ్వగానే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే కళ్లు మూసి తెరిచే లోపు టికెట్లన్నీ అయిపోతాయి. సామాన్య ప్రయాణికులకు ఒక టికెట్ కూడా దొరకని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ భారతీయ రైల్వే 2026లో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల వల్ల ఇకపై సామాన్యులకు తత్కాల్‌  టికెట్‌లు దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అవి మీకు ఎలా ఉపయోగపడతాయో చాలా వివరంగా తెలుసుకుందాం..

ఏజెంట్లకు నో ఎంట్రీ; సామాన్యులకే మొదటి ఛాన్స్‌

తత్కాల్ బుకింగ్‌లో అతి పెద్ద మార్పు ఏంటంటే, బుకింగ్‌ ప్రారంభమైన మొదటి కొన్ని నిమిషాలు కేవలం సాధారణ ప్రయాణికులకు మాత్రమే కేటాయించారు. గతంలో తత్కాల్ విండో ఓపెన్ అవ్వగానే లైసెన్స్‌ ఉన్న ఏజెంట్లు తమ వద్ద ఉన్న వేగవంతమైన సాఫ్ట్‌వేర్‌ సహాయంతో టికెట్లన్నీ బుక్ చేసే వారు. కానీ, ఇప్పుడు కొత్త రూల్‌ ప్రకారం, మొదటి కొన్ని నిమిషాల పాటు ఏజెంట్లు లాగిన్ అవ్వడానికి లేదా టికెట్లు బుక్ చేయటానికి వీలుండదు. దీని వల్ల సామాన్య ప్రయాణికులకు టికెట్లు దొరికే ఛాన్స్ చాలా పెరుగుతుంది. ఏజెంట్ల ప్రమేయం లేకుండా పారదర్శకంగా టికెట్లు పంపిణీ చేయాలన్నదే రైల్వే ముఖ్య ఉద్దేశం. 

దొంగ అకౌంట్లు- బాట్లపై కఠిన చర్యలు 

చాలా మంది ఏజెంట్లు లేదా బ్లాక్ మార్కెట్‌ కేటుగాళ్లు బాట్స్‌ అని పిలిచే ఒక రకమైన సాఫ్ట్‌వేర్‌ను వాడుతుంటారు. ఇవి మనుషుల కంటే వేగంగా వివరాలను నింపి టికెట్లను బుక్ చేస్తాయి. దీనిని అరికట్టడానికి రైల్వే ఇప్పుడు సరికొత్త అడ్వాన్స్‌డ్‌ మానిటరింగ్‌ టూల్స్‌ను వాడుతోంది. ఒక అకౌంట్ నుంచి అసాధారణమైన వేగంతో టికెట్లు బుక్ అవుతుంటే ఆ సాఫ్ట్‌వేర్‌ వెంటనే గుర్తు పడుతుంది. అలా అనుమానాస్పదంగా ప్రవర్తించే అకౌంట్లను రైల్వే తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది. దీని వల్ల అక్రమంగా టికెట్లు బుక్ చేసే వారికి చెక్ పడుతుంది. 

ఐడీ వెరిఫికేషన్ తప్పనిసరి

ఇకపై తత్కాల్ టికెట్‌ బుక్ చేయాలంటే కేవలం పేరు, ఊరు ఉంటే సరిపోదు. మొబైల్‌ నంబర్‌, ప్రభుత్వ గుర్తింపు కార్డు వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే, మీరు తత్కాల్ టికెట్‌బుక్ చేయడం అసాధ్యం. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దొంగ అకౌంట్లను, బ్లాక్ మార్కెట్ వ్యాపారాన్ని అరికట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ వివరాలు సరిగా ఉంటేనే టికెట్‌ కన్ఫార్మ్‌ అవుతుంది. 

సూపర్‌ ఫాస్ట్‌ సర్వర్లు- నో హ్యాంగింగ్‌

గతంలో తత్కాల్‌ టైమ్‌ అవ్వగానే రైల్వే వెబ్‌సైట్‌ స్లో అయిపోయేది లేదా హ్యాంగ్‌ అయిపోయేది. టికెట్లు బుక్ చేసే సమయంలో సర్వర్లు మొరాయించడం వల్ల చాలా మంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు రైల్వే తన సర్వర్‌ కెపాసిటీని భారీగా పెంచింది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా వెబ్‌సైట్‌వేగంగా పని చేసేలా ఏర్పాట్లు చేసింది. దీని వల్ల మీరు టికెట్లు బుక్ చేసేటప్పుడు వెబ్‌సైట్‌ ఆగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. 

యాప్‌- వెబ్‌సైట్‌-రెండూ సమానమే!

చాలా మందికి ఒక సందేహం ఉంది. మొబైల్‌ యాప్‌లో టికెట్లు త్వరగా దొరుకుతాయా? లేక వెబ్‌సైట్‌లోనా? అని.  తేడాను రైల్వే ఇప్పుడు తొలగించింది. యాప్, వెబ్‌సైట్ రెండూ ఒకే రకమైన సాంకేతికతతో, ఒకే వేగంతో పని చేసేలా మార్పులు చేశారు. అంతే కాకుండా ఆటో ఫిల్‌టూల్స్ లేదా స్క్రిప్టుల ద్వారా వివరాలను ఆటోమేటింక్‌గా నింపే ప్రయత్నాలను అడ్డుకోవడానికి స్పెషల్‌ ఫిల్టర్‌లను ఏర్పాటు చేశారు. దీని వల్ల అందరికీ సమానమైన అవకాశం లభిస్తుంది. 

పేమెంట్ సమస్యలకు చెక్ 

తత్కాల్‌ బుకింగ్‌లో మరో పెద్ద తలనొప్పి పేమెంట్‌ ఫెయిల్ అవ్వడం. సీట్లు ఖాళీగా ఉన్నా, డబ్బులు కట్ అయ్యి టికెట్ రాకపోవడం వల్ల ప్రయాణికులు విసిగిపోయే వారు. ఇప్పుడు పేమెంట్ సిస్టమ్‌ను కూడా రైల్వే శాఖ అప్‌డేట్ చేసింది. లావాదేవీలు వేగంగా పూర్తి అయ్యేలా ఫెయిల్ అయ్యే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. 

తప్పుడు వివరాలు ఇస్తే జరిమానా

టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికుల వివరాలు  చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. పేరు లేదా ఇతర గుర్తింపు వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే, ఆ టికెట్‌ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు జరిమానా కూడా కట్టాల్సి రావచ్చు. కాబట్టి మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే వివరాలు నింపాలి. 

Frequently Asked Questions

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్తగా వచ్చిన ప్రధాన మార్పు ఏమిటి?

బుకింగ్‌ ప్రారంభమైన మొదటి కొన్ని నిమిషాలు కేవలం సాధారణ ప్రయాణికులకు మాత్రమే కేటాయించారు. ఏజెంట్లు ఈ సమయంలో టికెట్లు బుక్ చేయలేరు.

తత్కాల్‌ టికెట్‌ బుక్‌ చేయడానికి ఇప్పుడు ఏమేమి తప్పనిసరి?

తత్కాల్‌ టికెట్‌ బుక్‌ చేయడానికి మొబైల్‌ నంబర్‌, ప్రభుత్వ గుర్తింపు కార్డు వెరిఫికేషన్‌ తప్పనిసరి చేశారు.

బాట్స్‌ (Bots) వాడకాన్ని రైల్వే ఎలా అరికడుతోంది?

అసాధారణ వేగంతో టికెట్లు బుక్‌ చేసే అనుమానాస్పద అకౌంట్లను గుర్తించడానికి రైల్వే అధునాతన మానిటరింగ్‌ టూల్స్‌ను ఉపయోగిస్తోంది. అలాంటి అకౌంట్లను బ్లాక్‌ చేస్తారు.

తత్కాల్‌ బుకింగ్‌ సమయంలో వెబ్‌సైట్‌ నెమ్మదిగా పనిచేయడం లేదా హ్యాంగ్‌ అవ్వడం వంటి సమస్యలు తొలగిపోయాయా?

రైల్వే తన సర్వర్‌ కెపాసిటీని భారీగా పెంచింది. దీనివల్ల రద్దీగా ఉన్న సమయంలో కూడా వెబ్‌సైట్‌ వేగంగా పనిచేస్తుంది.

తప్పుడు వివరాలు ఇస్తే ఏమవుతుంది?

టికెట్‌ క్యాన్సిల్‌ అయ్యే అవకాశం ఉంది. అలాగే, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు జరిమానా కూడా విధించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget