అన్వేషించండి

Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 

Iran Israel War 2026:అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి ఆ అధికారం లేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యుద్ధం ప్రకటించే అధికారం కాంగ్రెస్​కే ఉందని రాజ్యాంగం పేర్కొంది.
  • అయితే, దేశ రక్షణకు ముప్పుంటే సైనిక చర్యలకు అధ్యక్షుడికి అధికారం ఉంది.
  • 1942 నుంచి కాంగ్రెస్​ యుద్ధం ప్రకటించలేదు, అధ్యక్షులే సైనిక చర్యలు చేపట్టారు.
  • ఇరాన్​పై దాడులు, ప్రతీకార చర్యలతో గల్ఫ్​లో యుద్ధ వాతావరణం నెలకొంది.

Iran Israel War 2026:అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక పదం మారుమోగుతోంది. అది యుద్ధం. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరుపుతున్న మెరుపు దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో క్షిపణులు కురుస్తుంటే, కీలకమైన చర్చ జరుగుతోంది. అసలు ఒక దేశంపై యుద్ధం ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? అధ్యక్షుడు ట్రంప్‌, రక్షణ మంత్రి పీట్‌హెగ్‌సెత్‌ ఇరాన్ విషయంలో యుద్ధం అనే పదాన్ని బహిరంగంగానే వాడుతున్నారు. కానీ, అమెరికా చట్టాల ప్రకారం ఇది అధికారికంగా యుద్ధమేనా? లేక అధ్యక్షుడి పరిధిలోని సైనిక చర్యనా? అన్న అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. 

అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది? 

అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి ఆ అధికారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 ప్రకారం ఏదైనా మరో దేశంపై యుద్ధం ప్రకటించాలంటే హౌస్ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌, సెనేట్‌ రెండింటిలోనూ మెజారిటీ ఓట్లు రావాలి. ఉదాహరణకు 1812లో అమెరికా మొదటిసారి యుద్ధాన్ని ప్రకటించినప్పుడు హౌస్‌లో 79-49 ఓట్లు, సెనేట్‌లో 19-13 ఓట్లు వచ్చాయి.  

అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌  ప్రకారం, అధ్యక్షుడు అమెరికా సాయుధ దళాలకు కమాండర్‌న్ చీఫ్‌గా వ్యవహరిస్తారు. అంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే లేదా జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడితే, తక్షణమే సైనిక చర్య తీసుకునే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.  సుప్రీంకోర్టు కూడా ఈ అధికారాన్ని గుర్తించింది. ఇప్పుడు ఇరాన్‌ విషయంలో జరుగుతున్న దాడులు ఈ మాండర్‌ ఇన్‌ చీఫ్‌ అధికారాల కిందకే వస్తాయని వైట్‌ హౌస్‌ వాదిస్తోంది. 

1942 తర్వాత యుద్ధమే ప్రకటించలేదు

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికా చరిత్రలో కాంగ్రెస్ ఇప్పటి వరకు కేవలం 11 సార్లు మాత్రమే అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించింది. చివరిసారిగా 1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ప్రకటన వెలువడింది. మరి ఆ తర్వాత జరిగిన కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం, ఆఫ్గానిస్తాన్, ఇరాన్‌ యుద్ధాల సంగతేంటి అనే సందేహం వస్తుంది. సాంకేతికంగా చూస్తే అమెరికా వీటిని ఎప్పుడూ యుద్ధాలు అని ప్రకటించలేదు. 

భారీ ప్రాణ నష్టం,భారీ స్థాయిలో సైనిక సమీకరణ ఉండటం వల్ల ప్రజలు వీటిి యుద్ధాలు అని పిలుస్తారు. కానీ ఇవన్నీ అధ్యక్షుడి అధికారాల కింద జరిగిన సైనిక సంఘర్షణలు మాత్రమే. 2001లో సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌ తన కమాండర్ ఇన్‌చీఫ్‌ అధికారాలతో దాడులు మొదలుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ అథరైజేషన్ ఫర్ యూజ్‌ ఆఫ్ మిలిటరీ ఫోర్స్‌ అనే తీర్మానాన్ని ఆమోదించి అధ్యక్షుడి చర్యలకు మద్ధతు ఇచ్చింది. 

ఇరాన్ దాడుల సంగతేంటీ?

ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు తీవ్రతరమవుతున్న వేళ ఇరాన్‌ కూడా ప్రతీకార చర్యలకు దిగుతోంది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడుల వల్ల గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ మాట్లాడుతూ... ఇది ఇరాన్‌లాంటి సుదీర్ఘపోరాటం కాదు. దీనికి అంతం అంటూ ఉంటుంది అని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం రాజ్యాంగబద్ధమైనా అని కొంతమంది ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షుడు తన అధికార పరిధిని అతిక్రమిస్తున్నారా లేక దేశ రక్షణ కోసం ఈ నిర్ణయం తప్పనిసరి అయిందా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేవలం కమాండర్‌ ఇన్ చీఫ్ అధికారాలతోనే ఈ పోరు ముగిస్తారా లేదా కాంగ్రెస్ ముందుకు వెళ్లి అధికారికంగా యుద్ధం ప్రకటన చేస్తారా అన్నది వేచి చూడాలి.   

Frequently Asked Questions

అమెరికాలో యుద్ధాన్ని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది?

అమెరికా రాజ్యాంగం ప్రకారం, యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. అధ్యక్షుడు ఈ విషయంలో అధికారిక ప్రకటన చేయలేరు.

అధ్యక్షుడికి సైనిక చర్యలు తీసుకునే అధికారం ఉందా?

అవును, అధ్యక్షుడు అమెరికా సాయుధ దళాలకు కమాండర్‌న్ చీఫ్‌గా వ్యవహరిస్తారు. దేశ భద్రతకు ముప్పు కలిగితే లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సైనిక చర్య తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది.

అమెరికా చివరిసారిగా అధికారికంగా యుద్ధాన్ని ఎప్పుడు ప్రకటించింది?

అమెరికా చరిత్రలో కాంగ్రెస్ చివరిసారిగా 1942లో, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించింది.

ఇరాన్‌పై జరుగుతున్న దాడులు అధికారిక యుద్ధమా?

ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతున్న దాడులు అధ్యక్షుడు కమాండర్‌న్ చీఫ్‌ అధికారాల కిందకు వస్తాయని వైట్‌ హౌస్‌ వాదిస్తోంది. అయితే, కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం రాజ్యాంగబద్ధమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget