అన్వేషించండి

Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !

Iran Israel War 2026:ఒమన్ సమీపంలోని వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరపడంతో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. దీనితో హార్ముజ్ జలసంధి రాకపోకలకు అంతరాయం కలిగింది.

Iran Israel War 2026:మధ్య ప్రాచ్యంలో యుద్ధం పెను ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య రాజుకున్న నిప్పు  ఇప్పుడు యావత్ గల్ఫ్‌  ప్రాంతాన్ని దహించివేస్తోంది. ఈ అంతర్జాతీయ పోరులో అమాయక భారతీయలు బలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఓమన్ తీరంలో జరిగిన ఇరాన్‌ క్షిపణి, డ్రోన్ దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు యుద్ధం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా తన పౌరులకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ సహా 12 గల్ఫ్‌ దేశాల్లో ఉన్న అమెరికన్లు తక్షణమే ఆ దశాలను విడిచి వెళ్లాలని వైట్‌ హౌస్‌ హెచ్చరించింది. 

ఓమన్ తీరంలో మరణ మృదంగం

మధ్య ప్రాచ్య సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఇప్పుడు భారత్‌ను నేరుగా తాకాయి. మస్కట్‌ తీరానికి సుమారు 52 నాటికల్‌మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న MKD Vyom అనే నౌకపై ఇరాన్ డ్రోన్ బోట్ దాడి చేసింది. ఈ దాడిలో ఇంజిన్ రూమ్‌లో భారీ పేలుడు జరిగింది. మంటలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు మరణించినట్టు ఓమన్ అధికారులు ప్రకటించారు. భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు ముసండమ్‌ ద్వీపకల్పం సమీపంలో Skyligh అనే ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. ఈ నౌకలో ఉన్న 21మంది సిబ్బందిలో 16 మంది భారతీయులే. మొత్తం మీద పశ్చిమాసియా జలాల్లో జరిగిన వివిధ దాడుల్లో 20 మంది వరకు భారతీయలు గాయపడగా అందులో 13 మంది యూఏఈలోనే ఉన్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. 

అమెరికా అత్యవసర ఆదేశాలు 

మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఏ క్షణమైనా పెను విలయానికి దారి తీస్తుందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. అందుకే తమ పౌరుల రక్షణ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 12 గల్ఫ్‌ దేశాలను తక్షణమే విడిచిపెట్టాలని ఆదేశించింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, కువైట్‌ వంటి కీలక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. సౌదీఅరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో డ్రోన్ దాడి జరగడం, అక్కడ భారీగా మంటలు చెలరేగడం అమెరికాను మరింత అప్రమత్తం చేసింది. భారత్‌ కూడా తమ పౌరుల భద్రతపై ఆందోళన చెందుతోంది. ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్‌ ఇండియా, ఇండిగో సంస్థలు దుబాయ్‌ జెడ్డా వంటి నగరాల నుంచి భారతీయలను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి. 

ఖమేనీ మరణం, ఇరాన్ అంతర్గత కల్లోలం 

ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ, ఇజ్రాయెల్‌ - అమెరికా ఉమ్మడి దాడుల్లో మరణించారనే వార్త ఇరాన్‌ను కుదిపేస్తోంది. తాజాగా ఆయన భార్య బఘెర్జదే కూడా ఇజ్రాయెల్‌ దాడుల్లో తగిలిన గాయాల వల్ల మరణించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించగా, టెహ్రాన్‌ వీధుల్లో ప్రజల కన్నీరుమున్నీరవుతున్నారు. 

అయితే అమరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఇరాన్‌లో పాలన మార్పు జరగాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇరాన్‌ ఒక అణుశక్తిగా మార్చడానికి తాము సహించబోమని, ఇప్పటికే వారి అణు కేంద్రాలై దాడులు చేశామని ఆయన ప్రకటించారు. ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో 165మంది పాఠశాల విద్యార్థినులు మరణించడంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

భారత్ మార్కెట్లపై డొమినో ఎఫెక్ట్

ఈ యుద్ధం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. భారత్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హార్ముజ్‌ జలసంది ద్వారా రవాణా నిలిచిపోవడంతో ఎల్‌ఎన్‌జీ ధరు విపరీతంగా పెరిగాయి. ఆయిల్ ట్యాంకర్ల అద్దెలు రెట్టింపు అయ్యాయి. భారత్ వద్ద ఉన్న 100 మిలియన్ బారెళ్లు చమురు నిల్వలు ప్రస్తుతానికి స్వల్పకాలిక రక్షణను ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ భయం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ఆకాశాన్ని తాకుతున్నాయి. వెండి ధరల్లో కూడా తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుోతంది. ఇది దిగుమతుల ఖర్చును పెంచే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget