MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలయింది. తమ టీమ్ చేసిన ఒక తప్పు వల్లే ఇవాళ గెలిచే మ్యాచ్ ను ఓడిపొయ్యాము అంటూ చెప్పుకొచ్చింది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.
నదినే డిక్లెర్క్‌ను ఔట్ చేసే అవకాశాలను తమ టీమ్ చేరజార్చుకోవడమే తమ ఓటమికి కారణమైందని అన్నారు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఆఖరి ఓవర్ లో ఒక్క మంచి బాల్ వేసి ఉంటె ఫలితం తమ టీమ్ కు అనుకూలంగా ఉండేదని అభిప్రాయపడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి ఫలితాలు చాలా మాములే అని చెప్పుకొచ్చింది. అలాగే తమ బ్యాటింగ్ కు కూడా సరైన స్టార్ట్ లభించలేదు అన్నారు హర్మన్ ప్రీత్ కౌర్.
అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆఖరి ఓవర్‌లో 18 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయింది.





















