అన్వేషించండి

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా

సాజిద్ వ్యవహారంలో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లోని తన మూలాలను పూర్తిగా వదిలేసి, ఆస్తులను అమ్మేసి ఆస్ట్రేలియాలో స్థిరపడాలని భావించిన సాజిద్‌, ప్లాన్‌లపై ఆరా తీస్తున్నారు.

Australia Sydney Bondi Beach Attack Case:ఆస్ట్రేలియాలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాజిద్‌ అక్రమ్‌ జీవితం చుట్టూ ఇప్పుడు భారత నిఘా వర్గాలు ఉచ్చు బిగిస్తున్నాయి. సాజిద్‌ గడిచిన 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ ఆయన నేటికి ఆ దేశ పౌరసత్వం లభించలేదనే పచ్చి నిజం ఇప్పుడు విచారణలో వెలుగులోకి వచ్చింది. సాజిద్ ఆస్ట్రేలియా పర్మినెంట్‌ రెసిడెంట్‌ వీసా కోసం ఏకంగా 27 సార్లు ప్రయత్నించినా, ఆ దేశ ప్రభుత్వం అతని అభ్యర్థనను తోసిపుచ్చడం వెనుక ఉన్న బలమైన కారణాలపై కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

భారత పౌరుడిగా సాజిద్‌...

సాజిద్‌కు ఆస్ట్రేలియా పౌరసత్వం దక్కకపోవడంతో ఆయన ఇప్పటికి భారత పౌరుడిగానే కొనసాగుతున్నాడు. 2022లో ముగిసిన తన భారత పాస్‌పోర్ట్‌ గడువును, సాజిద్‌ మరో పదేళ్ల పాటు రెన్యువల్ చేయించుకున్నాడు. అయితే ఒకవైపు సాజిద్‌ పౌరసత్వం కోసం ఇబ్బంది పడుతుంటే, అతను కుమారుడు నవీద్‌ అక్రమ్‌ మాత్రం ఆస్ట్రేలియా పౌరుడిగా గుర్తింపు పొందాడు. నిరంతరం పర్మినెంట్‌ వీసా కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు సాజిద్‌. చివరకు రెసిడెంట్‌ రిటన్ వీసాతో సరిపెట్టుకోవాల్సిన వచ్చింది. 

27 ఏళ్ల ప్రయాణంపై ప్రశ్నలు: 

సాజిద్‌ ఆస్ట్రేలియాకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు 27 ఏళ్ల కాలంలో అతను బారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరిపిన ప్రయాణాల వివరాలపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఒక సాధారణ విద్యార్థిగా వెళ్లిన వ్యక్తి, ఇన్ని దశాబ్దాలుగా గడిచినా అక్కడి పౌరసత్వం పొందలేకపోవడం వెనుక ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సాజిద్‌ విదేశీ ప్రయాణ రికార్డులను జల్లెడ పడుతున్నాయి. 

ఆస్ట్రేలియా వెళ్లిన రెండేళ్లకే సాజిద్‌ వెన్నాసా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటికే వెన్నసా అస్ట్రేలియా పర్మినెంట్‌ రెసిడెంట్‌ వీసా కలిగి ఉండటంతో సాజిద్‌ తన స్టూడెంట్ వీసాను 2001లో పార్ట్నర్‌ వీసాగా మార్చుకున్నాడు. అయితే వీరి వివాహంలో ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. 2003 భార్యతో కలిసి హైదరాబాద్‌ వచ్చిన సాజిద్‌, ముస్లిం మత సంప్రదాయాల ప్రకారంం ఇక్కడ మరోసారి వివాహం చేసుకున్నాడు. 

తర్వాతి తరం.. 

ఈ దంపతులకు 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో నవీద్‌ జన్మించాడు. సాజిద్‌ పౌరసత్వం కోసం పారాడుతుంటే, నవీద్‌కు మాత్రం పుట్టుకతోనే ఆస్ట్రేలియా పర్మినెంట్‌ వీసా లభించింది. 2004లో తన కుమారుడిని మొదటిసారి హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు సాజిద్‌ పరిచయం చేశాడు. నాంపల్లి వీధుల్లో చదువుకున్న ఒక సగటు విద్యార్థి, విదేశీ గడ్డపై తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడనే అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 

తండ్రి మృతి- ఆస్తుల అమ్మకం; 

2006లో సాజిద్‌ తండ్రి మరణించినప్పుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చాడు. ఆ తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న సాజిద్‌, 2018లో పక్కా ప్లాన్‌తో హైదరాబాద్‌కు వచ్చి తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులన్నింటినీ విక్రించాడు. ఆ ఆస్తులను అమ్మగా వచ్చిన భారీ మొత్తాన్ని ఆయన ఆస్ట్రేలియాకు తరలించి, అక్కడ ఒక సొంత ఇల్లు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 

చివరి పర్యటన- వీడని చిక్కుముడి:

రికార్డుల ప్రకారం సాజిద్‌ చివరిసారిగా 2012లో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాడు. అయితే మూలాల్లో ఉన్న సమమాచారం ప్రకారం ఆయన 201నుంచి తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్‌ చేయించుకోలేదని ఒక వాదన ఉన్నప్పటికీ, మరోవైపు 2022లో పదేళ్లపాటు రెన్యువల్‌ చేయించుకున్నట్టు దర్యాప్తు సంస్థల రికార్డులు చెబుతున్నాయి. 

ఈ పరస్పర విరుద్ధమైన అంశాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లోని తన మూలాలను పూర్తిగా వదిలేసి, ఆస్తులను సైతం విక్రయించి ఆస్ట్రేలియాలో స్థిరపడాలని భావించిన సాజిద్‌, ఆ తర్వాత ఎలాంటి మార్పులకు లోనయ్యాడనేది ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget