అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
ఇండియా, సౌతాఫ్రికా మధ్య బుధవారం జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలసిందే. లక్నోలోని ఎకానా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్.. విపరీతంగా పొగమంచు వ్యాపించడంతో లో విజిబిలిటీ కారణంగా రద్దయింది. దీంతో ఇప్పుడు బీసీసీఐపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. శీతాకాలంలో నార్త్‌లో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని తెలిసినా కూడా నార్త్ స్టేట్స్‌లోనే మ్యాచ్‌లు ఎందుకు షెడ్యూల్ చేశారంటూ నిలదీస్తున్నారు. ‘వింటర్‌లో నార్త్ స్టేట్స్ సాధారణంగానే ఎక్కువ చలితో ఉంటాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలో కాలుష్యం కూడా పెరిగిపోతోంది.
ఈ రెండింటి కారణంగా అక్కడి ప్రంతాలను పొగమంచు కమ్మేస్తోంది. మరి ఈ విషయం తెలిసి కూడా అక్కడే ఎందుకు మ్యాచ్‌లని షెడ్యూల్ చేస్తున్నారు? మీకు సౌత్ వేదికలు కనిపించడం లేదా? ఇక్కడ పొగమంచు సమస్య చాలా తక్కువ. వింటర్‌లో మ్యాచ్‌లు సౌత్ స్టేట్స్‌లో షెడ్యూల్ చేస్తే ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉంది.’ అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమందైతే.. ఒకవేళ నార్త్ స్టేట్స్‌లోనే మ్యాచ్‌లు నిర్వహించాలని డిసైడ్ అయినా.. సాయంత్రం 7 గంటల తర్వాత పొగమంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి.. టీ20 మ్యాచ్‌లని కూడా మధ్యాహ్నం వేళ నిర్వహిస్తే బెటర్ అయిన సలహా ఇస్తున్నారు. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.





















