Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ సూపర్
గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో టీమ్ఇండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. అప్పుడు తగిలిన గాయం తీవ్రం అవడంతో ఇన్నాళ్లు అయ్యర్ గేమ్ కు దూరం కావాల్సి వచ్చింది. ఫార్మ్ కోల్పోవడం అలాగే ఎక్కువ గ్యాప్ రావడంతో శ్రేయాస్ అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు.
ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయాస్ అయ్యర్ హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీభత్సం సృస్టించాడు. తనదైన శైలిలో బౌండరీలు కొడుతూ కేవలం 36 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
మొత్తం 53 బంతులను ఎదుర్కొన్న అయ్యర్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభం కానుండడంతో అయ్యర్ ఫామ్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ అవకపోయినప్పటికీ శ్రేయాస్ అయ్యర్ తన స్టైల్ లో సెలెక్టర్లకు మంచి హింట్ ఇస్తున్నాడు. మరి న్యూజీలాండ్ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.





















