Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
Kokkoroko Movie: సముద్రఖని ప్రధాన పాత్రలో రమేష్ వర్మ నిర్మిస్తున్న సినిమా 'కొక్కోరోకో'. ఇందులో మనస్విని బాలబొమ్మల అతిథి పాత్రలో నటిస్తున్నారు.

కళలకు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. శాస్త్రీయ నృత్యంతో పాటు సంగీతం నేర్చుకుని సినిమాల్లోకి వచ్చిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అందులో మనస్విని బాలబొమ్మల చేరుతున్నారు.
సముద్రఖని సినిమాలో మనస్విని
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సముద్రఖని సుపరిచితులు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'కొక్కోరోకో'. దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి, కొత్త నిర్మాణ సంస్థ ఆర్వీ ఫిల్మ్ హౌస్ మీద తొలిసారి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. సంప్రదాయ కోడి పందేల నేపథ్యాన్ని ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో ఐదు విభిన్న పాత్రలు ఉన్నాయి. అందులో ఓ పాత్రను మనస్విని బాలబొమ్మల పోషిస్తున్నారు.
Also Read: టబుతో రిలేషన్షిప్... ఆమెతో వన్ నైట్ స్టాండ్... హీరోయిన్‌ను వదిలేసి ఆవిడతో పెళ్లి?
మనస్విని బాలబొమ్మల (Manaswini Balabommala)కు 'కొక్కోరొకో' మొదటి సినిమా. దీనితో వెండి తెరపైకి అడుగు పెడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో మనస్విని బాలబొమ్మల లుక్ రివీల్ అయ్యింది. ఇందులో ఆమెది అతిథి పాత్ర.
Also Read: Sara Arjun: 'యుఫోరియా' ట్రైలర్ లాంచ్‌లో సారా అర్జున్ సందడి... హైదరాబాద్ వచ్చిన 'Dhurandhar' బ్యూటీ
View this post on Instagram
సినిమాల్లో అడుగు పెట్టడానికి ముందు మనస్విని బాలబొమ్మల శాస్త్రీయ నృత్యం, సంగీతం నేర్చుకున్నారు. ఆమె స్టేజి ఆర్టిస్ట్ కూడా. 'Little Women' నాటకంలో జోగా, 'Much Ado About Nothing'లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలు పోషించారు. నటనతో పాటు ఆమెకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సాధించడంతో పాటు భక్తి గీతాల ప్రదర్శనలు ఇచ్చారు.
Also Read
: అమ్మాయితో ఎఫైర్... హీరో అక్రమ సంబంధంపై భార్య సంచలన వ్యాఖ్యలు
'కొక్కోరొకో' చిత్రాన్ని రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: సంకీర్తన్, ఛాయాగ్రహణం: ఆకాశ్ ఆర్ జోషి, సంభాషణలు: జివి సాగర్.





















