Tabu Ex Lover - Breakup Story: టబుతో రిలేషన్షిప్... ఆమెతో వన్ నైట్ స్టాండ్... హీరోయిన్‌ను వదిలేసి ఆవిడతో పెళ్లి?
Tabu Breakup: హీరోయిన్ టబు పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. అయితే బాలీవుడ్ హీరోతో ఆవిడ రిలేషన్షిప్ కహానీ ఒకటి బయటపడింది. ఆవిడ ప్రేమలో మోసపోయినట్టు అర్థమైంది.

బాలీవుడ్‌లో ప్రేమలో పడటం, బ్రేకప్ కావడం సర్వసాధారణం. ఒకరితో సంబంధంలో ఉంటూ మరొకరితో డేటింగ్ చేయడం కూడా! చాలా మంది నటులు తమ భాగస్వామిని మోసం చేసినట్లు కూడా వెల్లడించారు. సంజయ్ కపూర్ కూడా టబుతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మరొకరితో డేటింగ్ చేశానని చెప్పారు.
'ప్రేమ్' సినిమా (1995)తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు సంజయ్ కపూర్. ఈ సినిమాలో టబు కూడా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఓ పాత ఇంటర్వ్యూలో సినిమా విడుదలయ్యేలోపు తమ ప్రేమ ముగిసిపోయిందని సంజయ్ చెప్పారు. మరొక ఇంటర్వ్యూలో తనతో సంబంధంలో ఉన్నప్పుడు మహిప్ కపూర్‌తో కూడా సంజయ్ ప్రేమలో ఉన్నారని టబు చెప్పారు. ఈ విషయం ఇప్పుడు రెడిట్‌పై మళ్లీ తెరపైకి వచ్చింది.
ప్రేమ్ షూటింగ్.. రిలేషన్షిప్‌లో సంజయ్ - టబు
ఓ పాత ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా 'ప్రేమ్' షూటింగ్ సమయంలో టబుతో డేటింగ్ చేసినట్లు సంజయ్ కపూర్ అంగీకరించారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా మాట్లాడుతూ "సినిమా ప్రారంభంలో నేను టబుతో సంబంధంలో ఉన్నాను. కానీ సినిమా (ప్రేమ్) పూర్తయ్యే సమయానికి మేం ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం మానేశాం. నేను 31 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ సినిమా విడుదలైంది. 'ప్రేమ్' ఆడలేదు. కానీ, నాలుగు వారాల్లోనే మాధురీ దీక్షిత్‌తో కలిసి చేసిన 'రాజా' విడుదలైంది. అది బ్లాక్‌బస్టర్ అయ్యింది" అని అన్నారు.
Also Read: Sara Arjun: 'యుఫోరియా' ట్రైలర్ లాంచ్‌లో సారా అర్జున్ సందడి... హైదరాబాద్ వచ్చిన 'Dhurandhar' బ్యూటీ
మహిప్ కోసం టబును మోసం చేసిన సంజయ్?
బాలీవుడ్ హంగామా వంటి పోర్టల్స్ ప్రకారం... సంజయ్, టబు వివాహం చేసుకుంటారని హిందీ చిత్ర పరిశ్రమలో చాలా మంది భావించారు. అయితే టబును మహిప్ కపూర్ కోసం సంజయ్ మోసం చేయడంతో బ్రేకప్ జరిగింది. "మేము కలిసి ఉన్నప్పుడు కూడా అతను (సంజయ్ కపూర్) మహిప్‌ను కలిసేవాడు" అని టబు ఓ ఓల్డ్ ఇంటర్వ్యూలో చెప్పారు. చివరకు మహిప్‌ను వివాహం చేసుకున్నారు సంజయ్ కపూర్.
సంజయ్ - మహిప్ పెళ్లి వెనుక వన్ నైట్ స్టాండ్!
రౌనక్ రజానీ షో (2024)లో సంజయ్ కపూర్‌తో తన ప్రేమ కథను మహిప్ కపూర్ గుర్తు చేసుకుంటూ... ''మా కథ చాలా సింపుల్. నాకు ఒక వ్యక్తితో వన్ నైట్ స్టాండ్ రిలేషన్‌షిప్‌కు వెళ్లాను. నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని నాకు తెలియదు. నేను ఆ సమయంలో చాలా మత్తులో ఉన్నాను" అని చెప్పారు.
Also Read: అమ్మాయితో ఎఫైర్... హీరో అక్రమ సంబంధంపై భార్య సంచలన వ్యాఖ్యలు
View this post on Instagram
ఇంకా మహిప్ కపూర్ మాట్లాడుతూ... "అతను నన్ను అంగీకరించాడు. నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు. మాకు పెళ్లి ప్రతిపాదన వంటివి ఏమీ లేవు. మేం 'ది 1900' (నైట్ క్లబ్)లో ఉన్నాం. మేం మత్తులో ఉన్నాం. పార్టీ చేసుకుంటున్నాం. 'సరే, మనం పెళ్లి చేసుకుంటున్నాం' అని అతను అన్నాడు. టకీలా షాట్‌ల మధ్య నేను, 'సరే, పర్వాలేదు' అన్నాను. అంతే" అని చెప్పారు. పెళ్లికి ముందు ఐదేళ్ల పాటు సంజయ్‌తో డేటింగ్ చేశానని, ఇప్పుడు 30 ఏళ్లుగా అతనితోనే ఉన్నానని మహిప్ చెప్పారు.





















