Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
Renu Desai Reaction : తన పర్సనల్ లైఫ్‌ను కొందరు టార్గెట్ చేస్తున్నారని... దయచేసి అలా చెయ్యొద్దని రేణు దేశాయ్ అన్నారు. తాను కుక్కల కోసం పోరాడడం లేదని చెప్పారు.

Renu Desai Reaction On Political Entry : తాను పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదని... అనవసర రూమర్స్ ప్రచారం చెయ్యొద్దని పవన్ కల్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. వీధి కుక్కలను చంపడంపై ఆమె చేసిన కామెంట్స్‌కు ట్రోలింగ్ సాగగా... దానిపైనా స్పందించారు.
కుక్కల కోసం పోరాడడం లేదు
చాలా మంది తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేస్తున్నారని... తాను కుక్కల కోసం పోరాడడం లేదని అన్నారు రేణు దేశాయ్. 'నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. ప్రస్తుతం చేస్తున్న సామాజిక సేవతో సంతృప్తిగా ఉన్నా. నాపై తప్పుడు థంబ్ నైల్స్ రాస్తున్నారు. ప్రెస్ మీట్‌లో నేను ఎవరిపైనా అరవలేదు. బయటి వ్యక్తి వచ్చి గట్టిగా అరుస్తూ ఓ దశలో నాపై దాడి చేస్తాడా? అనే అనుమానం కలిగింది. వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని కంట్రోల్ చేశారు. అందుకే అంత గట్టిగా మాట్లాడాను.' అంటూ చెప్పారు.
View this post on Instagram
'నీచంగా కామెంట్స్ చేస్తున్నారు'
తాను కుక్కల కోసం పోరాడడం లేదని... మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నానని చెప్పారు రేణు దేశాయ్. 'కొందరు నాపై నీచంగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ నన్ను వదిలేశారు అంటూ నా పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేస్తున్నారు. నీ పిల్లలు కుక్క కరిచి చనిపోతే అప్పుడు తెలుస్తుంది అని అంటున్నారు. నేను ఓ అమ్మనే. నా బిడ్డ ప్రాణాలతో ఎందుకు ముడిపెడుతున్నారు. ఇది చాలా తప్పు. మీకు ఎక్కడైనా కుక్కలతో సమస్య ఉంటే నా ఎన్జీవోకు కానీ జీహెచ్ఎంసీకి కానీ సమాచారం ఇవ్వండి. వచ్చి మేమే తీసుకెళ్లిపోతాం. వంద కుక్కల్లో పది మాత్రమే మెంటల్‌వి ఉంటాయి. మనుషుల్లోనూ అంతే. కొందరు మంచివాళ్లు, కొందరు చెడ్డవాళ్లు ఉంటారు.' అని అన్నారు.
Also Read : రిపబ్లిక్ డే 2026 పరేడ్ కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఎం ఎం కీరవాణి! ఆస్కార్ విజేతకు మరో అరుదైన అవకాశం!
రేణు దేశాయ్ ఏమన్నారంటే?
వీధి కుక్కలను చంపడంపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుక్క కరిస్తే అన్నీ కుక్కలను చంపడంపై ఫైర్ అయ్యారు. రీసెంట్‌గా సుప్రీంకోర్టు తీర్పును సైతం తప్పుపట్టారు. ఏడాదిలో లక్షలాది మంది దోమకాటుతో ప్రాణాలు కోల్పోతున్నారని... ఆ ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. కొందరు డాగ్ హేటర్స్ కావాలనే ఇష్యూ చేస్తున్నారని... మనిషి ప్రాణం గురించి వారికి ఏమీ లేదని అన్నాారు. మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? అంటూ నిలదీశారు. ఐదు కుక్కలు కరిస్తే వంద కుక్కలను చంపేయడం ఏంటంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించగా... ఆ కామెంట్స్‌పై ఆమె తాజాగా రియాక్ట్ అయ్యారు.






















